logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

అను ఇమ్మాన్యుయేల్ తో డేటింగ్ లో ఉన్న ఆ మెగా హీరో ఎవరు?

తెలుగులో ఈ హీరోయిన్ చేసిన సినిమాలు అరడజనుకన్నా తక్కువే. కానీ ఇప్పుడు మెగా హీరోతో డేటింగ్ రూమర్స్ తో అను ఇమ్మాన్యుయేల్ పేరు మార్మోగిపోతోంది. నాని ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాల్లో నటించడంతో మెగా కాంపౌండ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది.

అయితే ఈ హీరోయిన్ మెగా హీరో అల్లు శిరీష్ తో డేటింగ్ లో ఉందంటూ కొంత కాలంగా వస్తున్న వార్తలు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. అందుకు అల్లు శిరీష్ చేసిన తాజా పోస్ట్ మరిన్ని అనుమానాలను పెంచింది. మార్చి 28 న అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు ఈ సందర్భంగా అనుకు బర్త్ డే విషెష్ చెప్తూ అల్లు శిరీష్ ఓ వీడియోను పోస్ట్ చేసాడు. అను సైకో అంటూ ప్రేమగా పిలుస్తూ ఆమెకు విషెష్ చెప్పాడు. వీరిద్దరూ కలిసి పోస్ట్ చేసిన వీడియోలో కూడా చాలా విషయమే ఉంది. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న తీరు అనుమానాలు రేకెత్తిస్తుంది.

ఇన్నాళ్లు వీళ్ల రిలేషన్ పై క్లారిటీ లేని నెటిజన్లు సోషల్ మీడియాలో వీరు చేస్తున్న హంగామా చూసి కచ్చితంగా ఈ జంట లవ్ ట్రాక్ ఎక్కేశారని ఫిక్స్ అయిపోతున్నారు. మరోవైపు వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో కూడా నటిస్తున్నారు. టాలీవుడ్ లో వివాదాలు, లవ్ స్టోరీస్ లేని హీరోగా పేరున్న అల్లు శిరీష్ పై ఇలాంటి రూమర్స్ రావడం మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ తో మహా సముద్రం సినిమాలో అను నటిస్తుంది. అలాగే అల్లు శిరీష్ కూడా తన నెక్స్ట్ సినిమా కోసం పని చేస్తున్నాడు. మరి వీరిద్దరిపై వస్తున్న వార్తలపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతారో అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

Related News