logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

కరోనా లక్షణాలు కనిపించని వారికి అతి పెద్ద ముప్పు!

కరోనా వైరస్ రెండు రకాలుగా మనుషులపై దాడి చేస్తుంది. కొందరిలో సాధారణంగా బయటకు కనిపించే లక్షణాలు ఉంటె మరి కొందరు రోగులలో అసలు ఎలాంటి లక్షణాలు లేకుండానే ఈ మహమ్మారి విజృంభిస్తుంది. లక్షణాలతో కూడిన కరోనా రోగులకన్నా లక్షణాలు లేకుండా కరోనా భారిన పడిన వారికి ఇప్పుడు అతి పెద్ద ముప్పు పొంచి ఉందంటున్నారు చైనా శాస్త్రవేత్తలు.

తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో లక్షణాలు లేకుండా కరోనా సోకిన వారిని కరోనా పూర్తిగా నయమైన రెండు నెలల తర్వాత పరీక్షించగా వారి శరీరంలో యాంటీబాడీల సంఖ్య అంతుచిక్కని విధంగా క్షీణించిందని అందుకు గల కారణాలు ఇంకా తెలియలేదని వెల్లడించారు. లక్షణాలు లేకుండా కరోనా సోకిన వారిలో 40 శాతం యాంటీ బాడీలు క్షీణిస్తే.. లక్షణాలు ఉండి కరోనా సోకిన వారిలో కేవలం 13 శాతం మాత్రమే యాంటీ బాడీలు తగ్గాయని అంటున్నారు. వీరిలో వాపు ప్రక్రియ నివారకాలుగా ఉపయోగపడే కణ సంకేత ప్రొటీన్ల సంఖ్య కూడా తగినట్టు తెలిపారు.

యాంటీ బాడీలు శరీరంలో వైరస్ లతో పోరాడతాయి. మానవ శరీరంపై ప్రతి రోజు కొన్ని వేల సంఖ్యలో వైరస్ లు దాడి చేస్తుంటాయి. వాటితో మన శరీరంలోని యాంటీ బాడీలు పోరాడి చంపేస్తాయి. ఇప్పుడు కరోనా వైరస్ ను జయించిన వారిలో కూడా ఈ యాంటీ బాడీలే కీలకం. ఒకసారి కరోనా నయమైన తర్వాత మళ్ళీ ఈ వైరస్ సోకదనేది కూడా అవాస్తవమని పరోశోధకులు అంటున్నారు.

Related News