logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ‘మన్మథుడు’ బ్యూటీ.. ఇప్పుడెలా ఉందో చూసారా?

విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగరాజును నటించితిన్ మన్మథుడు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాలు బింద్రే నటించగా మరో హీరొయిన్ గా అన్షు అంబానీ నటించింది. తన అమాయకపు నటనతో మొదటి సినిమాకే ఈ అమ్మడు ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొటింది. ‘గుండెల్లో ఏముందో కళ్ళలో తెలుస్తుంది’.. అంటూ నాగార్జునతో ఆడిపాడింది.

ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’లో నటించింది. అన్షు నటి మాత్రమే కాదు ఫ్యాషన్ డిజైనర్ కూడా. తెలుగులో రెండు సినిమాల్లో నటించిన ఈ భామ ఆ తర్వాత లండన్ కు చెందిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తరవాత వెండి తెరకు పూర్తిగా దూరమయ్యింది. 2004 లో వచ్చిన ‘మిస్సమ్మ’ సినిమాలో చివరిసారిగా గెస్ట్ రోల్ లో మెరిసింది.

అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ పేరు మళ్ళి వార్తల్లో నిలిచింది. దాదాపు 17 సంవత్సరాల తరవాత అన్షు టాలీవుడ్ రే ఎంట్రీ ఇస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో అన్షు కనిపించనుందని సమాచారం.

ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ వార్తతో అన్షు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటిని మళ్ళీ తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related News