logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌

బిగ్ బాస్ షోకు ఎప్పుడూ రేటింగ్స్ త‌గ్గ‌కుడా చూస్తుంటారు షో నిర్వాహ‌కులు. ప్రేక్ష‌కుల‌కు ఈ షో బోర్ కొట్ట‌కుండా చూసుకుంటారు. ఎప్పుడైనా షో ప్రేక్ష‌కుల‌కు కొంచెమైనా బోర్ కొడుతుందని అనిపిస్తే షోను మ‌ళ్లీ ఆసక్తిక‌రంగా మార్చ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ఇటువంటిదే ఒక‌టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. పాత కంటెస్టెంట్స్‌తో రొటీన్‌గా మారుతున్న హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అప్పుడ‌ప్పుడు కొత్త కంటెస్టెంట్స్‌ను రంగంలోకి దింపి షోను ఇంట్రెస్టింగ్‌గా మారుస్తారు.

ఈ సీజ‌న్‌లో హౌజ్‌లోకి మొద‌ట కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత స్వాతి దీక్షిత్‌, జ‌బ‌ర్ద‌స్త్ ముక్కు అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వ‌చ్చారు. కానీ, వీరిద్ద‌రిలో మొద‌ట స్వాతి దీక్షిత్, త‌ర్వాత కుమార్ సాయి హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ ఒక్క‌డే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నాడు.

దీంతో ఇప్పుడు షోలో పారిసిపెంట్ల సంఖ్య పెంచేందుకు, షోను మ‌రింత ఆసక్తిక‌రంగా మార్చేందుకు మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహ‌కులు. ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఫోక్ సింగ‌ర్ మంగ్లీని హౌజ్‌లోకి పంపించాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే మంగ్లీతో చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. ఆమెకు బిగ్ బాస్ టీమ్ భారీ ప్యాకేజ్ ఆఫ‌ర్ చేసింద‌ని తెలుస్తోంది.

నిజానికి బిగ్ బాస్ హౌజ్‌లోకి మొద‌ట్లోనే మంగ్లీ ఎంట్రీ ఇస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, బ‌తుక‌మ్మ పండుగ‌కు మంగ్లీ పాట చాలా స్పెష‌ల్. ఈ పండుగ‌కు ఆమె పాట కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. అందుకే బిగ్ బాస్ హౌజ్‌లోకి అప్పుడే ఎంట్రీ ఇవ్వ‌డానికి మంగ్లీ నిరాక‌రించింది. ఇప్పుడు బ‌తుక‌మ్మ పండుగ కూడా అయిపోవ‌డంతో ఇప్పుడు మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లేందుకు అంగీక‌రించింది.

ఓ ఛాన‌ల్‌లో యాంక‌ర్‌గా జీవితం ప్రారంభించి అన‌తి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది మంగ్లీ. త‌న పాట‌లు, మాట‌ల ద్వారా అందరినీ ఆక‌ట్టుకుంటుంది. ఇటీవ‌ల సినిమాల్లోనూ పాట‌లు పాడుతూ బిజీగా ఉంటోంది. మంగ్లీ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తే క‌చ్చితంగా ఇత‌ర పార్టిసిపెంట్స్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. మంగ్లీకి ఎలాగూ విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. కాబ‌ట్టి ఓట్లు కూడా బాగానే ప‌డ‌టం ఖాయం. ఇప్ప‌టివ‌ర‌కు ఏడో వారం పూర్తి చేసుకున్న బిగ్ బాస్ హౌజ్‌లోకి ఒక‌వేళ మంగ్లీ క‌నుక ఎంట్రీ ఇస్తే చివ‌రి వ‌ర‌కు హౌజ్‌లోనే ఉండ‌వ‌చ్చు.

Related News