మెగా ఫ్యామిలిలో చాలా కాలం తర్వాత జరుగుతున్న వేడుక కావడంతో నిహారిక వెడ్డింగ్ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 9న ఉదయపూర్ వేదికగా జొన్నలగడ్డ చైతన్యతో ఏడడుగులు వేసింది నిహారిక. అందుకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మెగా ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తుంది.
పెళ్లి గురించి ఎక్కువగా వార్తల్లో ఉండే సాయి హీరో ధరమ్ తేజ్ పెళ్లి జరగనుందని వార్తలు వచ్చినప్పటికీ తనకు ఇప్పట్లో ఆ ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పాడు ఈ హీరో. అయితే తాను కాకపోయినా మరొక హీరో పెళ్లి త్వరలోనే జరగనుందని హింట్ ఇచ్చాడు. ఇటీవల ‘సోలో బతుకే సో బెటరు’ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా పెళ్ళెప్పుడు అని అడగగా తనకన్నా ముందు హీరో అల్లు శిరీష్ పెళ్లి ఉండనుందని క్లారిటీ ఇచ్చాడు. తనకు పెళ్లి చేసుకోవడానికి ఇంకా సమయం ఉందని తనపై ఉన్న కొన్ని బాధ్యతలను పెళ్ళికి ముందే పూర్తి చేయవలసి ఉందని వివరించాడు. అయితే అల్లు శిరీష్ తనకన్నా పెద్దవాడని వచ్చే ఏడాది అతని పెళ్లి ఉండవచ్చని తెలిపాడు. దీంతో మరోసారి మెగా ఇంట పెళ్లి సందడి ఉండనుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.