logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!

పంచాయతీ ఎన్నికల ఫలితాలతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. బాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో ఓటమికి కారణాలను విశ్లేషించుకుని పనిలో పడ్డారు చంద్రబాబు. తాజాగా కుప్పంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. కుప్పం ఫలితాలతో టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.

పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపై కుప్పంలో నాలుగు మండలాలకు సంబందించిన నేతలు, కార్యకర్తలంతా కలిసి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. టీడీపీ ముఖ్య నేతల తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో కార్యక్రమం ముగియకుండానే కొంతమంది నేతలు మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కుప్పంకు చెందిన మరో ముగ్గురు ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వారిలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు రాజీనామా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.

Related News