logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌

తెలంగాణ‌లో ప్ర‌జా ప్ర‌తినిధులు వ‌రుస‌గా క‌రోనా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ‌రావు, ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డికి కూడా క‌రోనా వైర‌స్ సోకింది. ప్ర‌స్తుతం వీరు హైద‌రాబాద్‌లోని ప్రైవేటు ఆసుప‌త్రుల‌లో చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ‌రావుతో పాటు ఆయ‌న భార్య‌, సోద‌రుడు, ఇద్ద‌రు, డ్రైవ‌ర్లు, ఒక గ‌న్‌మెన్‌, వంట‌మ‌నిషి స‌హా వారి ఇంట్లో మొత్తం 8 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డితో పాటు ఆయ‌న త‌ల్లి, సోద‌రుడు, గ‌న్‌మెన్‌కు కూడా క‌రోనా పాజిటీవ్ వ‌చ్చింది. దీంతో వీరు హైద‌రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Related News