logo

మరో మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంకండి: షాకిచ్చిన డబ్ల్యూహెచ్వో

కరోనాతో తలకిందులవుతున్న ప్రపంచం నెత్తిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో పిడుగులాంటి వార్త వేసింది. కరోనా కోరల నుంచి పూర్తిగా బయటపడకముందే మరో కొత్త మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్దంకావాలాంటి హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 73వ వరల్డ్ హెల్త్ వర్చ్యువల్ ను సదస్సును నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే డబ్ల్యూహెచ్వో ఈ హెచ్చరికలు జారీ చేసింది. బ్రుసెల్లోసిస్ అనే మరో ప్రాణాంతక వ్యాధి వ్యాపిస్తుంది దానిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు సిదంగా ఉండాలంటూ పిలుపునిచ్చింది. ఈ వ్యాధి కూడా కరోనా పుట్టుకొచ్చిన చైనా ల్యాబ్ లోనే పుట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ వ్యాధి 6 వేల మందికి సోకింది.

చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్జౌలో ఈ వ్యాధి సోకిన బాధితులను గుర్తించారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ఈ వ్యాధికి కారణమవుతుంది. ఈ వైరస్ బారిన పడిన వారు దగ్గు జలుబు జ్వరం వొల్లునొప్పులు వంటి ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇది కూడా గతేడాది ల్యాబ్ నుంచి లీకైనట్టుగా అభిప్రాయపడుతున్నారు.

Related News