logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

నిహారిక పెళ్ళికి హాజరుకాని పవన్ సతీమణి.. కారణం ఇదే!

మెగా డాటర్ నిహారిక పెళ్లి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఆయన పిల్లలు కూడా హాజరయ్యారు. బయట చాలా తక్కువగా కనిపించే పవన్ కూతురు ఆద్య, కొడుకు అకీరాలు ఈ పెళ్లిలో అందరికన్నా హైలెట్ గా నిలిచారు.

మెగా హీరోల్లో అందరికన్నా ఆజానుబాహుడిలా కనిపిస్తున్న అకీరా నందన్ పైనే కెమెరా ఫోకస్ అంతా. అయితే ఈ పెళ్లి వేడుకలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కనిపించలేదు. కానీ ఆయన సతీమణి అన్నా లెజినోవా కూడా కనిపించకపోవడం విశేషం. గతంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూతురి వేడుకకు పవన్ సతీసమేతంగా హాజరై ఆశీర్వదించిన విషయం తెలిసిందే.

అయితే మెగా ఫ్యామిలిలో నిహారిక పెళ్లి వేడుక ఎంత ముఖ్యమైందో తెలిసిందే. అలాంటి వేడుకలో ఆమె లేకపోవడం ఏమిటని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే అన్నా లెజెనోవా నిహారిక పెళ్ళికి రాకపోవడం వెనుక ఒక కారణం ఉంది. ఆమె ప్రతి సంవత్సరం ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా డిసెంబర్ నెలలో మాత్రం తన పుట్టింటికి వెళ్లి కుటుంబంతో గడుపుతారట.

ఆమె రష్యా పౌరురాలు అన్న విషయం తెలిసిందే. క్రిస్టమస్ వేడుకలు కూడా ఇదే నెలలో ఉంటాయి. కాబట్టి ఆమె అక్కడే క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు కూడా పూర్తి చేసుకుని జనవరి వరకు అక్కడే గడుపుతారట. సో నిహారిక పెళ్ళిలో ఆమె కనిపించకపోవడానికి ఇదే కారణమని సమాచారం.

Related News