logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

నిద్రలేవగానే పాదాలు, మడమల్లో నొప్పి ఎందుకు వస్తుంది? ఈ చిట్కాలు పనిచేస్తాయి!

ఉదయం నిద్ర లేవగానే పదాల్లో కింద పెట్టలేనంత నొప్పి కలుగుతుంది. మడమల్లో కూడా ఈ నొప్పి ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. మీరు కూడా ఈ సమస్యతోనే బాధపడుతున్నారా? అయితే పాదాలు, మడమల్లో ఈ నొప్పికి గల కారణాలు ఏమిటి? ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో తెలుసుకుందాం.

లక్షణాలు:
మన శరీరంలోని ప్రతి కదలికకకు కీళ్ల సహాయం అవసరం అవుతుంది. అరికాలులో ఉండే కణజాలం అడుగులు వేసే సమయంలో కుషన్‌లా పనిచేసి, అరికాలిని షాక్‌ నుంచి రక్షిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ దీనిలోని సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. ఇది పలచబారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో చిన్న చిన్న దెబ్బలకూ ఈ కణజాలం డ్యామేజ్‌ అవుతుంది. దాంతో మడమ నొప్పి, వాపు వస్తాయి. ఈ నొప్పి అరికాలు కింది భాగంలో ఉంటుంది. ఉదయం పూట మొట్టమొదటిసారి నిల్చున్నప్పుడు మడమలో ఇలా నొప్పి రావడాన్ని ప్లాంటార్‌ ఫేషిౖయెటిస్‌ అంటారు. ఈ నొప్పి పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా వస్తుంది.

కారణాలు:
అధిక బరువు ఉన్నవారిలో ప్రధానంగా ఈ సమస్య ఉంటుంది. అధిక బరువు లేకపోయినా వయసు పెరుగుతున్న కొద్దీ శరీర బరువు ఆపగలిగే శక్తి కండరాలు కోల్పోతాయి. డయాబెటిస్ కూడా ఈ నొప్పికి కారణమవుతుంది. ఎక్కువసేపు నిలబడి పని చేసేవారిలో, పనుల కారణంగా వేగంగా శరీరకదలికలను మార్చాల్సిరావడం వలన కూడా పాదాల్లో, మడమల్లో నొప్పి కి కారణం కావచ్చు. మహిళలో హై హీల్స్ వాడే వారిలో ఈ నొప్పి అధికంగా కనిపిస్తుంది. వాతంతో బాధపడువారు కూడా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. అలంటి వారు కొన్ని చిట్కాలను పాటించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ చిట్కాలు పాటించండి:
గరుకు నెల మీద నడవటం వలన పాదాలపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. అందువల్ల మెత్తటి రబ్బరు చెప్పులను వాడండి. ఐస్ క్యూబ్ లతో పాదాలకు మసాజ్ చేసుకోవచ్చు. వాతం ఉన్న వారు పులుపు, దుంప కూరలకు దూరంగా ఉండండి. పాదాలకు ఆముదం రాసి ఉప్పు నీటిలో అయిదు నిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజు ఉదయం సాయంత్రం చేయడం వలన ఉపశమనం కలుగుతుంది. పాదాలకు లవంగం నూనెతో మర్దన చేయడం ద్వారా రక్తప్రసరణను పెంచి నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. కొన్ని సార్లు శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడమే దీనికి సరైన చికిత్స. ఈ నొప్పి తీవ్రంగా ఉండి చాలా కాలంగా వేధిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా వీటిని నిర్దారించి చికిత్సను అందిస్తారు.

Related News