తమిళ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు విశాల్. సినిమాలే కాకుండా సమాజంలో జరిగే అనేక విషయాలపై తన స్వరం వినిపిస్తూ హాట్ టాపిక్ గా మారాడు. అయితే ఈ యంగ్ హీరో పెళ్లిపై గతంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. కొంత కాలం సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వర లక్ష్మితో విశాల్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి.
ఇటీవల హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డి తో నిశ్చితార్థం చేసుకుని ఆ వార్తలకు చెక్ పెట్టాడు విశాల్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో ఫ్రెండ్ పాత్రలో కనిపించి పాపులర్ అయ్యింది అనీషా. విశాల్ తో ఎంగేజ్మెంట్ అయిన కొద్దీ రోజులకే ఆమె తన సోషల్ మీడియా నుంచి విశాల్ తో ఉన్న ఫోటోలను తొలగించింది.
దీంతో వీళ్లిద్దరి పెళ్లి క్యాన్సర్ అయ్యినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలు నిజమనే సందేహం వ్యక్తమవుతుంది. అనీషా రెడ్డి రహస్యంగా వేరొకరి పెళ్లి చేసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. విశాల్ తో బ్రేక్ అప్ ఇందుకు కారణమని తెలుస్తుంది. ఈ విషయంపై ఎవ్వరూ స్పందించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుంది. విశాల్ ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లాడిందని తెలిసి ఈ హీరో అభిమానులు షాక్ కు గురవుతున్నారు.