logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఏపీ.. 15 ప్రతిష్టాత్మక పురస్కారాలు..!

జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్రం సత్తా చాటింది. ప్రతి ఏటా పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డుల్లో 2020 సంవత్సరానికి గాని ఆంధ్రప్రదేశ్ రాష్టానికి 15 అత్యుత్తమ పురస్కారాలు దక్కాయి. జాతీయ స్థాయిలో ఈ అవార్డుల ఎంపిక జరుగగా ఈ–పంచాయత్‌ పురస్కార్‌ కేటగిరి–ఐఐ(ఎ)లో దేశవ్యాప్తంగా ఏపీ రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం విశేషం.

దీనిపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నివసించే ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశ పెట్టి తీసుకువచ్చిన సంస్కరణలకు గాను ఈ పురస్కారాలు అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది పా. గో జిల్లాలకు సాధారణ కేటగిరీలో జిల్లా స్థాయి పురస్కారం లభించింది.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, గుంటూరు జిల్లా మేడికొండూరు, చిత్తూరు జిల్లా రామచంద్రాపురం, వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరులకు జనరల్‌ కేటగిరిలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ శశక్తికరణ్‌ పురస్కారాలు లభించాయి.

విజయనగరం జిల్లా బొందపల్లె మండలంలోని కొండకింద, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వేములకోట, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని అంగలకుదురు గ్రామ పంచాయతీలకు ధిమాటిక్‌ కేటగిరీలో పురస్కారాలు దక్కాయి.

జనరల్‌ కేటగిరిలో తూ.గో. జిల్లా రాయవరం మండలంలోని చెల్లూరు, ప్రకాశం జిల్లా కురిచేడు, గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని కట్టేవరం గ్రామ పంచాయతీలు పురస్కారాలు సాధించుకున్నాయి.

గ్రామాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవడంలో విజయనగరం జిల్లాలోని బొండపల్లి, నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం కింద తూ.గో. జిల్లాలోని చెల్లూరుకు అవార్డు లభించింది. రాష్ట్ర స్థాయిలో 2016-17, 2017-18 సంవత్సరాలకు చెల్లూరు పంచాయతీ ఇప్పటికే రెండు సార్లు ఉత్తమ పంచాయతీ పురస్కారం అందుకుంది.

చైల్డ్‌ ఫ్రెండ్లీ పంచాయత్‌ అవార్డు కింద తూ.గో. జిల్లాలోని మూలస్థానంకు అవార్డులు వచ్చాయి. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించడం, అంగన్ వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నందుకు గాను మూలస్థానం ఈ అవార్డుకు ఎంపికైంది.

Related News