logo

  BREAKING NEWS

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త!  |   అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |  

పాపం జ‌గ‌న్‌.. ఇంకా ఏడాదిన్న‌ర‌నే ముఖ్య‌మంత్రిగా ఉంటారా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌ద‌వీకాలం గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. సాధార‌ణంగా ఏదైనా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన మూడునాలుగేళ్ల వ‌ర‌కు మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల గురించి పార్టీలు పెద్ద‌గా మాట్లాడ‌వు. కానీ, ఏపీలో మాత్రం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన ఏడాది నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల గురించి పార్టీలు త‌ర‌చూ మాట్లాడుతున్నాయి. జ‌గ‌న్ పూర్తిస్థాయిలో అధికారంలో ఉండ‌ర‌ని ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా న‌మ్ముతున్నాయి.

ముఖ్య‌మంత్రి అయిన కొత్త‌లో జ‌గ‌న్ జైలుకు వెళ‌తార‌ని, కాబ‌ట్టి ఆయ‌న ప‌ద‌వి నుంచి దిగిపోక త‌ప్ప‌ద‌ని తెలుగుదేశం నేత‌లు అంచ‌నా వేశారు. ఇదే విష‌యాన్ని టీడీపీ నేత‌లు ప‌దేప‌దే చెప్పారు. కానీ, వారు అనుకున్న‌ట్లుగా ఇప్ప‌టికైతే జ‌ర‌గ‌డం లేదు. దీంతో ఇప్పుడు జ‌మిలి ఎన్నిక‌ల‌పై తెలుగుదేశం నేత‌ల‌కు ఆశ‌లు మొద‌ల‌య్యాయి. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి ఏడాదిన్న‌ర‌నే అవుతోంది. ఇంకో ఏడాదిన్న‌ర మాత్ర‌మే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ప‌దేప‌దే చెబుతున్నారు.

ఏడాదిన్న‌ర‌లోనే జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌నేది ఆయ‌న బ‌ల‌మైన న‌మ్మ‌కం. కొన్నిసార్లు జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కులు సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. వీరి అంచ‌నా ప్ర‌కారం జ‌మిలి ఎన్నిక‌లు క‌నుక వ‌స్తే జ‌గ‌న్ మూడేళ్లు మాత్ర‌మే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతారా ? అనే అనుమానాలు వ‌స్తున్నాయి. ముఖ్య‌మంత్రి కావ‌డానికి జ‌గ‌న్ ప‌దేళ్ల పాటు శ్ర‌మించారు. ఎంతో క‌ష్ట‌ప‌డి, బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొని అధికారంలోకి వ‌చ్చారు.

అనుభ‌వం లేని కార‌ణంగా అధికారంలోకి వ‌చ్చి స్థిర‌ప‌డ‌టానికే ఆయ‌న‌కు చాలానే స‌మ‌యం ప‌ట్టింది. ఇప్పుడిప్పుడే పాల‌న ప‌ట్టాలెక్కింది. ఇటువంటి స‌మ‌యంలో ఇంకా ఏడాదిన్న‌ర‌లోనే జ‌గ‌న్ ప‌ద‌వీకాలం ముగుస్తుంద‌నే ప్ర‌చారం వైసీపీ శ్రేణుల‌ను కూడా క‌ల‌వ‌ర‌పెడుతోంది. చంద్ర‌బాబు చెబుతున్న‌ట్లు కేంద్రం నిజంగానే జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తెలంగాణ‌లో కేసీఆర్ కూడా జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం జ‌మిలి నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి క‌స‌ర‌త్తు కూడా చేస్తోంది. జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటే పార్ల‌మెంటులో మూడింత రెండొంతుల మంది స‌భ్యుల మెజారిటీ ఉండాలి. బీజేపీకి ఇందుకు త‌గిన బ‌లం ఉంది. ఆ త‌ర్వాత మూడింత రెండొంతుల రాష్ట్రాల అసెంబ్లీలు జ‌మిలి ఎన్నిక‌ల‌కు అంగీక‌రించాలి. ఎలాగూ 17 రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలోకి ఉండ‌టంతో ఇది కూడా పెద్ద స‌మ‌స్య ఏమీ కాదు. రాష్ట్ర‌ప‌తి ఆమోద‌ముద్ర లాంఛ‌న‌మే అవుతుంది.

అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగి, జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డ‌మే త‌మ‌కు రాజ‌కీయంగా మంచిద‌ని కేంద్రంలోని బీజేపీ భావిస్తే క‌నుక 2022 చివ‌ర్లో లేదా 2023 మొద‌ట్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అందుకే పార్టీలు ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల గురించి ఎక్కువ‌గా ఆలోచిస్తున్నాయి. ఒక‌వేళ జ‌మిలికి అనువైన స‌మ‌యం కాద‌ని, లేదా న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌స్తాయ‌ని కేంద్రం అనుకుంటే మాత్రం జ‌మిలి ఎన్నిక‌ల ఆలోచ‌న చేయ‌క‌పోవ‌చ్చు.

Related News