రాజధాని భూముల వ్యవహారంలో విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. రాజదాని భూములపై సిట్, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన పనుల్లో ఆరోపణలను విచారించేందుకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిది. సిట్, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటును సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా గతంలో హైకోర్టును ఆశ్రయించారు.
వీరి పిటీషన్‌పై తీర్పును గతంలో రిజర్వ్ చేసిన ధర్మాసనం ఇప్పుడు సిట్, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించింది. దీంతో రాజధాని భూముల వ్యవహారంపై విచారణ జరిపించాలని భావిస్తున్న జగన్ ప్రభుత్వానికి బ్రేకులు పడ్డాయి.