ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 8,092 సాంపిల్స్ పరీక్షించగా 45 మంది కోవిడ్ 19 పాజిటీవ్‌గా తేలింది. దీంతో మొత్తం రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,452కు చేరింది. వీరిలో 1,680 మంది డిశ్చార్జ్ కాగా, 54 మంది మరణించారు. ప్రస్తుతం 718 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 41 మంది కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నెల్లూరు జిల్లాలో ఒకరు కరోనా వల్ల మరణించారు.