logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ మూడు అంశాల‌ను దృష్టిలో పెట్టుకొనే ఆయ‌న ఎక్కువ‌గా ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే రైతుల కోసం రైతు భ‌రోసా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం రైతు భ‌రోసా కేంద్రాల‌ను అన్ని గ్రామాల్లో ప్రారంభిస్తోంది. తాజాగా రైతుల సంక్షేమం కోసం మ‌రో మంచి ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

ఐదు ఎక‌రాల లోపు వ్య‌వ‌సాయ భూమి ఉన్న రైతుల‌కు ఉచితంగా బోర్లు ప్ర‌భుత్వ‌మే వేయించాల‌ని జ‌గ‌న్ ఇవాళ నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. చిన్న క‌మ‌తాలు ఉన్న రైతుల‌కు ఇద్ద‌రు, ముగ్గురికి క‌లిపి ఒక బోరు చొప్పున వేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. నిజానికి, రైతుల‌కు ఉచితంగా బోర్లు వేయిస్తామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందే త‌న మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.

అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి న‌వ‌ర‌త్నాలు, మేనిఫెస్టోలోని అంశాల‌ను నెర‌వేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్న జ‌గ‌న్ ఇప్పుడు ఉచిత బోర్ల నిర్ణ‌యం ద్వారా మ‌రో పెద్ద హామీని నెర‌వేర్చ‌బోతున్నారు. ఈ ప‌థ‌కం రైతుల‌కు చాలా వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. సాగునీటి కోసం భూగ‌ర్భ జ‌లాల‌పై ఆధార‌ప‌డే రైతులు చాలా వ‌ర‌కు బోర్ల‌పైనే ఆధార‌ప‌డుతుంటారు. ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి బోర్లు వేయ‌డం, నీళ్లు ప‌డ‌కుంటే మ‌ళ్లీ వేయ‌డం, అప్పులపాలు కావ‌డం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ‌మే ఉచితంగా బోర్లు వేయిస్తే రైతుల‌కు చాలావ‌ర‌కు ఉప‌శ‌మ‌నం ద‌క్కుతుంది.

Related News