logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆమెతో ఎఫైర్ గురించి అడిగేది.. నా భార్యను టార్చర్ పెట్టా: యాంకర్ రవి

ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలదొక్కుకోవడం అందరికీ సాధ్యం కాదు. కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొందరు తమ కుటుంబాలను కూడా కెరీర్ కోసం నిర్లక్ష్యం చేస్తారు. ఇలాంటి అనుభవమే బుల్లి తెర యాంకర్ రవికి ఎదురైంది. ఒకప్పుడు రవి- లాస్య జోడీగా మా చానెల్ లో ప్రసారమయ్యే సంథింగ్ సంథింగ్ ప్రోగ్రామ్ వీరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. రవి లాస్య నిజంగానే భార్యా భర్తలేమో అని చాలా మందికి సందేహం ఉండేది.

వీరిద్దరిపై సోషల్ మీడియాలో అనేక రూమర్లు కూడా వచ్చాయి. తాజాగా జీ తెలుగు ఛానెల్ లో బాపు బొమ్మకు పెళ్ళంటా అనే ప్రోగ్రామ్ ను వినాయక చవితి సందర్భంగా నిర్వహించారు. నిహారిక, నాగబాబు, అనసూయ, జానీ మాస్టర్, బాబా బాస్కర్ మాస్టర్, జబర్దస్త్ కామెడియన్లంతా కలిసి సందడి చేసారు. ఈ ప్రోమోలో రవి తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

నాకు పెళ్ళయ్యి 8 ఏళ్ళు అయ్యింది. కానీ నేను నా భార్యను ఏడాదిన్నర క్రితమే బయటకు పరిచయం చేసాను. ఒకసారి పెళ్లయిందని తెలిస్తే ఈ ఫీల్డ్ లో ఆఫర్లు రావనే భయం ఉండేది. అప్పట్లో జోడీ జోడీ అంటూ నాపై చాలా రూమర్లు వచ్చేవి. ఆ టైం లో నా గురించి తనను చాలా మంది మీ ఆయనకు ఆమెతో అఫైర్ ఉందట కదా అని అడిగేవారు. ఆ విషయం తాను నాతో కూడా చెప్పేది కానీ నేను బాధపడకూడదని నవ్వుతూనే చెప్పేది.

నేను తనను ఎంతో టార్చర్ పెట్టాను ఆరున్నరేళ్ల పాటు తను నా వల్ల టార్చర్ అనుబిభవించింది. అయినా నన్ను భరించింది. తాను నాకు తెలియకుండా ఎన్నో సార్లు నిద్రపోతూ ఏడ్చేది. ఆ విషయం నాకు తెలిసినా నేను పట్టించుకోలేదు. ఎలాంటి ఈగోలకు పోకుండా నా కుటుంబాన్ని నిలబెట్టింది. ఈరోజు నన్ను ఈ స్టేజి మీద నిలబెట్టింది. అంటూ వేదిక మీద మోకాళ్లపై కూర్చుని తన భార్య నీతూ సక్సేనా కు కన్నీళ్లతో క్షమాపణలు చెప్పాడు రవి.

Related News