logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఆ అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాల్సిందే.. కానీ: యాంకర్ ప్రదీప్

హైదరాబాద్ కు చెందిన ఓ యువతి తనపై 139 మంది 5 వేల సార్లు అత్యాచారానికి పాల్పడ్డారంట పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదులో భాగంగా ఆమె మాజీ ఎంపీ పీఏ, విద్యార్ధి సంఘాల నాయకులు, సినీ నటులతో పాటుగా బుల్లి తెర యాంకర్ ప్రదీప్ మంచి రాజు పేరు కూడా వెల్లడించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రదీప్ కు కూడా పోలీసులు నోటీసులు జారే చేసారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనపై యాంకర్ ప్రదీప్ మొదటిసారిగా స్పందించాడు. ఇంతటి సున్నితమైన కేసులో తన పేరును పదే పదే ప్రస్తావించడం.. మీడియాలో కూడా ఎలాంటి అధరాలు లేకుండా తన పేరును వాడటం బాధ కలిగించిందన్నారు. అత్యాచార బాధితురాలికి కచ్చితంగా న్యాయం జరగవలసిందే. కానీ అందుకోసం నన్ను బాధితుడిని చేస్తారా అంటూ ప్రశ్నించారు. అవతలి వ్యక్తులు ఎలాంటి ఉదేశ్యంతో తన పేరును వాడుతున్నారా తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలంతో కూడిన భాషనువాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. దీని వెనక ఎవరున్నారో అందరినీ బయటకు తీస్తానన్నాడు.

ఈ కేసులో నిజాలు తేలేలోపే తనకు గాని తన కుటుంబ సభ్యులకు గాని ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది. యూట్యూబ్, వెబ్ సైట్లలో వ్యూస్ కోసం తనను టార్గెట్ చేస్తూ తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని ప్రదీప్ వాపోయాడు. ఇది కూడా ఒకరకమైన మానసిక అత్యాచారామె. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై, దూషిస్తూ కామెంట్లు పెడుతున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్న తనపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా వాడటం అలవాటుగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు.

Related News