తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. 33 ఏళ్ల ప్రదీప్ పెళ్లిపై చాలా రోజులుగా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన ఫలానా వారితో ప్రేమాయణం నడుపుతున్నారని, ఫలానా ఆమెతో ప్రదీప్ పెళ్లి అని పలు వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి కానీ అవేవీ నిజం కాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ప్రదీప్ పెళ్లిచూపులు అయిపోయాయని, పెళ్లి కుదిరిందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే, ప్రదీప్ పెళ్లి చేసుకోబోయేది సినిమా, టీవీ రంగాలకు ఏ మాత్రం సంబంధం లేని ఒక రాజకీయ నాయకురాలిని అనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. అవును, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేసే ఒక యువ రాజకీయ నాయకురాలితో ప్రదీప్ మాచిరాజు వివాహం కుదిరిందని చెబుతున్నారు. పెళ్లి చూపులు కూడా అయిపోయాయని, ఇరువైపుల వారం వివాహానికి ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
ఈ మేరకు బుల్లితెర వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ మాచిరాజు టాప్ యాంకర్‌గా స్థిరపడ్డాడు. ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. 33 ఏళ్ల వయస్సు కూడా రావడంతో ప్రదీప్ పెళ్లి అనేది ఎప్పుడూ ట్రెండింగ్ టాపిక్‌గా ఉంటోంది. ఏ షోకి వెళ్లినా, ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ప్రదీప్‌కు కచ్చితంగా పెళ్లి ఎప్పుడూ అని ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే, ఎప్పుడు పెళ్లి విషయం ఎత్తినా ప్రదీప్ మాట దాటేస్తూ వస్తాడు.
ఇటీవల అయితే తన పెళ్లి విషయంపైన తానే జోకులు కూడా వేస్తూ ఈ విషయాన్ని దాటేస్తున్నాడు. పెళ్లి తనకు పడదని, దానికి దూరంగా ఉంటానని చెప్పాడు. అయితే, ఇటీవల ప్రదీప్ తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు. అలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది కదా అని ప్రదీప్‌ను అలీ అడిగాడు. మొదట తన గర్ల్ ఫ్రెండ్ సొనాలి బింద్రే అని దాటేశాడు ప్రదీప్. నిజమైన పేరు చెప్పు అని అలీ అడిగాడు.
ఎందుకు సర్, ఈపాటికి ఆమెకు ఇద్దరు పిళ్లలు ఉండి ఉంటారు అని ప్రదీప్ చెప్పాడు. ఈ షో కూడా చూస్తూ ఉంటుంది అని కూడా చెప్పాడు. ప్రదీప్ సమాధానం బట్టి ఆయన ప్రేమించిన అమ్మాయికి మరో పెళ్లి అయ్యిందనేది స్పష్టమైంది. దీంతో ఇప్పుడు ప్రదీప్ కూడా సెటిల్ కావడానికి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే, తనకు ఏ మాత్రం సంబంధం లేని రాజకీయ రంగంలో ఉన్న యువతిని పెళ్లాడాలని ప్రదీప్ నిర్ణయించుకున్నాడనే విషయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరి, ఎవరా ప్రదీప్‌కు కాబోయే భార్య అయినా యువ నాయకురాలు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.