logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

అధికారులకే షాకిచ్చిన ట్రెజరీ ఉద్యోగి.. ట్రంకు పెట్టెల్లో భారీగా బయటపడ్డ ఖజానా

సినిమా స్టోరీని తలపించేలా భారీ అవినీతి సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ట్రెజరీ కార్యాయలంలో పని చేస్తున్న మనోజ్ కుమార్ కారు డ్రైవర్ బంధువు ఇంట్లో 8 ట్రంకు పెట్టలను అధికారులు, పోలీసులు కలిసి స్వాధీనం చేసుకున్నారు. అందులో కేజీల కొద్దీ బంగారం, వెండితో పాటుగా లక్షల్లో డబ్బును గుర్తించారు. వీటిని లెక్కించడానికి పోలీసులు నానా యాతన పడవలసి పడ్డారు. కేవలం రెండు పెట్టెలను లెక్కించడానికే అర్థరాత్రి దాటింది. ఈ నగదును మొత్తాన్ని అధికారులు వాహనాల ద్వారా తరలించారు.

వివరాల్లోకి వెళితే.. ట్రెజరీ కార్యాలయంలో మనోజ్ కుమార్ సిఎంనియర్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అతని తండ్రి ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల కాగా తండ్రి విధుల్లో మరణించడంతో కారుణ్య నియామకం కింద మనోజ్‌ కుమార్‌కు 2006 నవంబర్‌ 17న ట్రెజరీ శాఖలో జూనియర్‌ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన మూడేళ్లకే భారీగా అవినీతికి తెరతీసాడని మనోజ్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి.

కార్యాలయంలోనే అత్యంత అవినీతిపరుడిగా పేరున్న మనోజ్ కుమార్ అనతికాలంలోనే అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తాడు. ఇటీవల మనోజ్ కుమార్ అతని కారు డ్రైవర్ నాగలింగంపై సీసీఎస్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వీరి కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో సీసీఎస్ డీఎస్పీ ఈ. శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలోని బృందాలు మంగళవారం దాడులు నిర్వహించారు.

డ్రైవ్స్ నాగలింగం ను అదుపులోకి తీసుకుని విచారించగా అతని అత్తగారింట్లో భారీగా నగదు బయటపడింది. మొత్తం 8 ట్రంకు పెట్టెల్లో 2. కేజీల బంగారం, 84 కిలోల వెండి, 15. 55 లక్షల నగదు. 27 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, 49 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లకు సంబందించిన పత్రాలు, 7 అధునాతన బైకులు, 3 రాయల్ ఎన్ ఫీల్డులు, 2 లగ్జరీ కార్లు, 4 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇందులోనే ఓ ఎయిర్‌ పిస్టోల్‌ కూడా లభ్యమైంది. తహశీల్ధార్ మహబూబ్ పాషా ఆధ్వర్యంలో వీటిని పంచనామా చేసారు. ఈ ఘటనలో మనోజ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసినట్టుగా సమాచారం. ఈ ఘటనలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News