logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

విడుదలైన 24 గంటల్లోపే.. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు మరో షాక్!

టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు షాకిచ్చారు. వాహనాల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిపారనే ఆరోపణలతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ గురువారం కండిషన్డ్ బెయిలుపై కడప జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల అనంతరం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి 20 కి పైగా వాహనాలలో భారీ ర్యాలీ గా తాడిపత్రికి వెళ్లారు.

ర్యాలీ కారణంగా రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న తాడిపత్రి సీఐ దేవేందర్ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ రోడ్డులో హెవీ వెహికిల్స్ కు మాత్రమే అనుమతి ఉందని ర్యాలీ నిర్వహించకుడాని చెప్పడంతో జేసీ సీఐ తో దురుసుగా ప్రవర్తించారట. జేసీ అభిమానులు, కార్యకర్తలు పోలీసులను చుట్టుముట్టడంతో కొద్ద్ది సేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

కాగా డ్యూటీలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తిచడం, కడప జైలు వద్ద లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో జేసీ, అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డిలపై అనంతపురం పోలీసులు ఐపీసీ 353తో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. అలాగే 31 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసారు. తాజాగా ఈ కేసు విచారణ నిమిత్తం వీరిని వన్ టౌన్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు 2 గంటల పాటు స్టేషన్లో ఉంచారు.

Related News