ఇటీవల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హీరో రామ్ చరణ్, వరుణ్ తేజ్, తమన్నా, రకుల్ ప్రీత్ వంటి తారలు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో తార తనకు కరోనా సోకి ఉండవచ్చనే అనుమాన వ్యక్తం చేస్తుంది.
యాంకర్ అనసూయ భరద్వాజ్ తనకు కరోనా లక్షణాలు ఉన్నాయంటూ చెప్పి షాకిచ్చింది. ”ఒక షూట్ కోసం ఈరోజు పొద్దున్నే లేచాను. ఎందుకో నాకు కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనిపించింది. వెంటనే షూట్ క్యాన్సల్ చేసుకున్నాను. వీలైనంత త్వరాగా కరోనా పరీక్షలు చేయించుకుంటాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండండి. కరోనా పరీక్షలు చేయించుకోండి” అని ఆమె ట్వీట్ చేసింది.
అయితే ఇప్పుడు ఈ ట్వీట్ మెగా ఫ్యామిలిలో కలకలం రేపుతోంది. ఇప్పటికే మెగా ఇంటి నుంచి పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నాగబాబు కూతురు నిహారిక అనసూయ కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం కలిసి పని చేస్తున్నారు. ఒక వేళ అనసూయకు కరోనా పాజిటివ్ అని తేలితే నిహారిక కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యామిలీని టెన్షన్ పెడుతుంది.