logo

  BREAKING NEWS

ఫలించిన ‘శ్వేత రాయబారం’.. మనసు మార్చుకున్న బుద్ధా!  |   హిందూపురంలో సీన్ రిపీట్.. అభిమానికి విశ్వరూపం చూపించిన బాలయ్య!  |   నా అనుచరుడు ఒక్కడు చాలు.. నీ పని ఖతం: టీడీపీలో బుద్ధా వర్సెస్ కేశినేని  |   అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |  

క్రేజీ ఆఫర్ కొట్టేసిన అనసూయ ఏకంగా పవర్ స్టార్ తో..

యాంకర్ అనసూయ భరద్వాజ్ అటు బుల్లి తెర వెండి తెర అనే తేడా లేకుండా దూసుకుపోతుంది. ‘రంగస్థలం’ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ ను అనసూయ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అందుకే ఏది పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంచుకుంటుంది. ఇక ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా అందంతో పాటుగా అభినయంతో కూడా ప్రేక్షకులను మెప్పించింది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తాజాగా అనసూయకు సంబందించిన ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. అనసూయ పవర్ స్టార్ సరసన నటించే అవకాశం కొట్టేసిందని టాక్ నడుస్తుంది. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించారట. దీంతో త్వరలోనే అనసూయ పవన్ కళ్యాణ్ తో ఆడిపాడనుందని సమాచారం.

ఇప్పటికే ఒకసారి పవన్ తో నటించే ఛాన్స్ మిస్సయ్యానని తెగ ఫీలైపోతోందట అనసూయ. గతంలో అత్తారింటికి దారేది సినిమాలో ఐటెం సాంగ్ కోసం అనసూయని మొదట సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వలన ఆ ఛాన్స్ వదులుకున్న అనసూయ ఈసారి మాత్రం వెంటనే ఒకే చెప్పేసిందని సమాచారం. ఈ వార్త గనుక నిజమైతే ఇక టాలీవుడ్ లో అనసూయ స్పీడ్ ను ఆపలేరని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News