logo

  BREAKING NEWS

పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |   ఏపీ పంచాయతీ వార్: జగన్ సర్కార్ ఆదేశాలకు ఎస్ఈసీ నో..!  |   తెలంగాణలో కొత్త పార్టీ.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల!  |   సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |  

అనసూయకు కోలీవుడ్ బంపర్ ఆఫర్: ఆ శృంగార తార పాత్రలో రంగమత్త..!

90 లలో కుర్రకారును ఉర్రుతలూగించిన శృంగార తార సిల్క్ స్మిత పాత్రలో బుల్లితెర యాంకర్ అనసూయ నటించనున్నట్టుగా తెలుస్తుంది. రంగస్థలం సినిమాతో రంగమత్తగా టాలీవుడ్ లో ఫెమస్ అయిన అనసూయను ఆ తర్వాత వరుస ఆఫర్లు పలకరిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె రానా ‘రంగమార్తాండ’, రవితేజ- రమేష్ వర్మ కాబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఖిలాడీ’ సినిమాలలో నటిస్తుంది.

అనసూయ ప్రధాన పాత్రలో ‘థాంక్ యు బ్రదర్’ అనే సినిమా కూడా తెరకెక్కుతుంది. ఇదిలా అండగా తాజాగా ఈ యాంకర్ తమిళ సినీ పరిశ్రమలోకి ఎంటర్ కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంది. సిల్క్ స్మిత ను అనుకరిస్తూ ఉన్న ఓ ఫోటోను ఆమె పోస్ట్ చేస్తూ కోలీవుడ్ లో కి వెళ్తున్నట్టుగా తెలిపింది.

అయితే ఆమె నటించే పాత్ర సిల్క్ స్మిత ను పోలి ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు కోలీవుడ్ లోకి అడుగుపెడుతుండటంపై ఆమె ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News