logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్..!

బుల్లి తెరపై రొమాంటిక్ పెయిర్ ఎవరు అంటే మొన్నటివరకు సుడిగాలి సుధీర్- రష్మీ అనే చెప్పేవారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బుల్లి తెరను షేక్ చేస్తున్న హిట్ పియర్ ఎవరూ అంటే అందరి నోటా వినిపించే మాట హైపర్ ఆది- అనసూయ. గత కొంతకాలంగా షోలో వీరిద్దరి మధ్య సంభాషణలు టీవీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తున్నాయి.

తనదైన టైమింగ్, పంచులతో ఆది జబర్దస్త్ రేంజ్ ను పెంచేసాడు. ఇక ట్రేండింగ్ దుస్తులు, అందమైన మాటలతో అనసూయ చేసే యాంకరింగ్ కు కూడా అభిమానులు ఎక్కువే. ఆది స్కిట్ మొదలైతే అందులో అనసూయ పై పంచులు తప్పనిసరి. అందుకు ఆమె సిగ్గుపడుతూ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అదనపు హైలెట్ గా నిలుస్తాయి. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరూ మంచి స్నేహితులని టాక్. ఈ నేపథ్యంలో అనసూయ హైపర్ ఆదికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనసూయ అటు సినిమాలు, ఇటు టీవీ షోలతో బిజీగా ఉంటుంది. ఆమె ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆ నిర్మాతలకు హైపర్ ఆది పేరు కూడా రికమండ్ చేసిందట. అంతేకాదు తనతో సమానంగా ఆదికి కూడా భారీ రెమ్యునరేషన్ ఇప్పిస్తుందని సమాచారం. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Related News