logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

ఇప్పటివరకు ఆ కిక్ రాలేదు.. నెటిజన్ కు అనసూయ షాకింగ్ రిప్లై

ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయకు అభిమానులు కూడా ఎక్కువ. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో, ఐటెం సాంగ్స్ లో నటిస్తూ అలరిస్తుంది. ఈ మధ్య నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరుస్తుంది. ఆమె నటించిన కొన్ని సినిమాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులకు బ్రేక్ రావడంతో ఇంట్లోనే కుటుంబంతో కాలక్షేపం చేస్తుంది. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుంది. ఇటీవల ఆమెను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు ఆమె నుంచి ఊహించని సమాధానం వచ్చింది. ఇప్పటివరకు మీరు నటించిన పాత్రల్లో మీకు బాగా ఛాలెంజింగ్ గా అనిపించినా పాత్ర ఏమిటని అతను అడిగాడు.

అనసూయ నటించింది కొద్ది సినిమాల్లోనే అయినా ఆమె ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన పాత్ర మాత్రం రంగస్థలం సినిమాలోని రంగమత్త పాత్ర. రామ్ చరణ్ తో కలిసి ఆమె పండించిన భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. అయితే నెటిజన్ ప్రశ్నకు ఆమె ఇదే సమాధానం చెబుతుందని అనుకుంటారు ఎవరైనా. కానీ తాను ఇప్పటివరకు ఎన్ని పత్రాలు చేసినా తనకు మాత్రం ఎందుకనో ఆ కిక్ రాలేదంటుంది.

ఛాలెంజింగ్ గా అనిపించిన పాత్ర తనకు ఎవ్వరూ ఇవ్వలేదని తెలిపింది. ఈ సమాధానానికి ఆమెపై కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. మరీ అంత అవలీలగా చేసావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా ఇప్పుడామె తమిళ పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టబోతోంది. కనీసం అక్కడైనా ఆమెకు ఛాలెంజింగ్ రోల్స్ వస్తాయేమో చూడాలి మరి.

Related News