logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

అన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఉసిరికాయ‌తో చెక్..!‌

కార్తీకమాసంలో విరివిగా లభించే ఉసిరికాయని ఇండియన్ సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. ఉసిరికాయలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వలన దీనిని ఎన్నో జబ్బులను నయం చెయ్యడానికి ఉపయోగిస్తారు. అయితే దీనితో ఎక్కువ వెరైటీ పదార్థాలను తయారు చేయలేము కాబట్టి ఇంట్లో ఉసిరికాయ వాడకం తక్కువగా ఉంటుంది.

కానీ దీనిలో పూర్తి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. చలికాలంలో ఉసిరిని వినియోగించడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఉసిరి సుగుణాల గురించి అటు సైన్సులోనూ, ఇటు ఆయుర్వేదంలోనూ చెప్పబడింది. చలికాలంలో అత్యధికంగా వేధించే సమస్య ఆస్తమా. ఉసిరిని తెనెతో కలిపి తీసుకోవడం వలన ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్ని కాలేయ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు ఉసిరికాయ దివ్యౌషధంలా పనిచేస్తుంది.

కామెర్ల వ్యాధిని కూడా నయం చేయగల శక్తి ఉసిరిలో ఉంది. ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. చలికాలంలో ఎదురయ్యే అనేక చర్మ సమస్యలను ఉసిరి నివారిస్తుంది. చర్మంపై యుక్త వయసులో వచ్చే మొటిమలు, యాక్నో‌, ముడతలను తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఉసిరిని ప్రతి రోజు తీసుకునేవారికి శ్వాసకోశ సమస్యలు దరిచేరవు. ఇందులో ఉండే సి విటమిన్ ఇన్ఫెక్షన్లు, దగ్గును నిరోధిస్తుంది.

ఉసిరిని తేనెతో కలిపి తీసుకునేవారికి గ్యాస్, అసిడిటీ, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఉండవు. ఇందులో ఉండే లాక్సటివ్ ప్రాపర్టీస్ మలబద్దకం, పైల్స్ వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఆయుర్వేద సూచిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్త శుద్ధికి, శరీరంలో ఉన్న కొవ్వుని దూరం చేయడంలో ఉసిరి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఉసిరికాయను ఏదో ఒక రకంగా శరీరంలోకి తీసుకుంటే అధిక బరువును తగ్గిస్తుంది.

షుగర్ వ్యాధిని అదుపు చేసి ఆయుష్షును పెంచుతుంది. రకరకాల క్యాన్సర్లకి, సెల్ డీజెనరేషన్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను ఉసిరికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అడ్డుకుంటాయి. ఉసిరి కాయ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. ఉసిరికాయ రసాన్ని జుట్టుకు పట్టించడం వలన చుండ్రు సమస్య తగ్గుతుందని చెప్తారు. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చే సమస్యను కూడా ఉసిరి నివారిస్తుంది.

Related News