logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

అమితాబ్ బచ్చన్, అభిషేక్ లకు కరోనా పాజిటివ్!.. కుటుంబం మొత్తానికి..

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇటీవల అయన కిడ్నీ సంబంధిత నొప్పితో బాధపడుతూ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అమితాబ్ కు కరోనా పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.

కాగా అమితాబ్ తో సన్నిహితంగా ఉన్నవారందరికి కరోనా టెస్టులు చేయగా అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. వీరి కుటుంబంలో ఇంకా ఎంత మంది ఈ మహమ్మారి భారిన పడ్డారనే విషయం తేల్చేందుకు అమితాబ్ కుటుంబం మొత్తానికి కోవిడ్ పరీక్షలు నిర్వ‌హించారు వైద్యులు.

అమితాబ్ భార్య‌ జ‌య బ‌చ్చ‌న్, కోడ‌లు ఐశ్వ‌ర్యారాయ్‌, మ‌న‌వ‌రాలు ఆరాధ్య‌కి కూడా టెస్టులు చేయ‌గా.. వారికి క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. ప్రస్తుతం వారంతా సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని అమితాబ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బిగ్‌బీ, అభిషేక్‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Related News