logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా ప్రకటించారు. కరోనా సోకిన విషయాన్ని ట్వీట్ చేస్తూ.. తనకు కొంత కాలంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా వచ్చిందని తెలిపారు. కాగా తన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టుగా వెల్లడించారు. కొంత కాలంగా తనను కలిసిన వారంతా క్వారెంటైన్ లోకి వెళ్లాలని అమిత్ షా కోరారు.

అమిత్ షా కరోనా భారిన పడటంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అమిత్ షా కోలుకోవాలని కోరుతూ స్పందిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయమై ట్వీట్ చేసారు. ఈ వార్త ఎంతో బాధించిందన్నారు. అమిత్ షా త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా అవిజృంభిస్తుంది. ఇప్పటికే బీజేపీ నేతలు కరోనా భారిన పడి మరణించారు. ఏపీలో మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూశారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో కేబినెట్ మంత్రి కమలా రాణి (62) కరోనా భారిన పడి చికిత్స పొందుతూ మరణించారు.

Related News