logo

  BREAKING NEWS

ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |  

మ‌ళ్లీ ఆసుప‌త్రిలో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఇటీవ‌లే క‌రోనా నుంచి కోలుకున్న అమిత్ షా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆగ‌స్టు 3న క‌రోనా పాజిటీవ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ఆయ‌న ఎయిమ్స్ ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందారు. చికిత్స అనంత‌రం అమిత్ షా కోలుకున్నారు. క‌రోనా నుంచి కోలుకున్నా ఆయ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు మాత్రం వెంటాడుతున్నాయి. ముఖ్యంగా శ్వాస‌సంబంధ స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

క‌రోనా బారిన త‌ర్వాత ఈ స‌మ‌స్య‌తో ఇప్ప‌టికే ఆయ‌న ఎయిమ్స్‌లో చేరి కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయ‌న శ‌నివారం రాత్రి ఎయిమ్స్ ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం, ఆసుప‌త్రి వ‌ర్గాలు దృవీక‌రించ‌లేదు.

Related News