logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

నేను ఆరోగ్యంగా ఉన్నా.. ఆ ప్ర‌చారం న‌మ్మ‌కండి

త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న ర‌క‌ర‌కాల పుకార్ల‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖండించారు. గ‌త కొన్ని రోజులుగా అమిత్ షా ఆరోగ్యంపై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న తీవ్ర అనారోగ్యంతో ఉన్నార‌ని, క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని కొంద‌రు ప‌ని గ‌ట్టుకొని ప్ర‌చారం చేశారు. అయితే, ఈ ప్ర‌చారాన్ని తాను చాలా రోజుల పాటు తేలిగ్గా తీసుకున్నాన‌ని, ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నుకున్నాన‌ని అమిత్ షా పేర్కొన్నారు.

కానీ, త‌న ఆరోగ్యం గురించి బీజేపీ కార్య‌క‌ర్త‌లు, త‌న శ్రేయోభిలాషులు ఆందోళ‌న చెందుతున్నార‌ని త‌న దృష్టికి వ‌చ్చింద‌ని అమిత్ షా చెప్పారు. అందుకే తాను ఈ త‌ప్పుడు ప్ర‌చారానికి ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాన‌ని, త‌న‌కు ఎటువంటి జ‌బ్బు లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హోంమంత్రిగా క‌రోనాపై దేశం చేస్తున్న పోరాటంలో త‌న బాధ్య‌త‌లు నెర‌వేరుస్తున్నాన‌ని చెప్పారు. ఈ మేర‌కు అమిత్ షా ట్వీట్ చేశారు.

Related News