logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

జమ్మూ కశ్మీర్ పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు!

ఆర్టికల్ 360 రద్దు తర్వాత రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశీర్ కు రాష్ట్ర హోదా విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమ్మూ కాశ్మీర్ పై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతి పక్షాలపై ఆయన మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. దీనిపై అసత్యాలు ప్రచారం చేయడం సరైది కాదన్నారు.

అయితే సరైన సమయంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బిల్లు తీసుకురావడం అంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదని స్పష్టం చేసారు. అలా అని బిల్లులో ఎక్కడా లేదన్నారు. లోక్ సభలో శనివారం జమ్మూ కాశ్మీర్ పునర్ వ్యవస్తీకరణ బిల్లుపై ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసారు. కాశ్మీర్ కు రాష్ట్ర హోదా దక్కుతుందనే నమ్మకం తమకు లేదని కొందరు నేతలు వ్యాఖ్యానించడంతో అమిత్ షా ఫైర్ అయ్యారు.

గత 70ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని మండిపడ్డారు. కాశ్మీర్ పై ప్రతి అంశానికి సంబంధించిన స్పష్టమైన అవగాహన కేంద్రానికి ఉందని దానిపై వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధమేనన్నారు. ఆర్టికల్ 360 రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. హింస, అశాంతితో కూడిన కాశ్మీర్ ను భవిష్యత్తులో చూడలేమని అన్నారు.

Related News