logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

మళ్ళీ ఆసుపత్రిలో చేరిన కేంద్ర మంత్రి అమిత్ షా..

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇటీవల కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ఆగస్టు 2వ తేదీన కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం నిర్దారణ అయినట్టుగా అమిత్ షా పేర్కొన్నారు. అనంతరం వైద్యుల సూచనలతో ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరి కరోనా చికిత్స తీసుకున్నారు. కాగా తాజాగా ఆగస్టు 14వ తేదీన మరోసారి పరీక్షలు జరుపగా కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో తిరిగి అమిత్ షా ఆయన నివాసానికి చేరుకున్నారు.

ఇదిలా ఉండగా సోమవారం అర్థరాత్రి అమిత్ షా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో రాత్రి 2 గంటల ప్రాంతంలో హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత మూడు రోజులుగా ఆయన శ్వాసకోస ఇబ్బందులతో, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించామని టెస్టులో కరోనా నెగిటివ్ గానే వచ్చినట్టుగా పేర్కొన్నారు.

కాగా అమిత్ షాకు సిటీ స్కాన్ పరీక్షలు జరుపగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకినట్టుగా గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. ఇదిలా ఉండగా అమిత్ షాకు మరోసారి కరోనా వచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని వైద్యులు ఖండించారు.

Related News