logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

భారత సరిహద్దుల్లో అమెరికా దళాలు..!

భారత్ తో పాటుగా దక్షిణాసియా దేశాలన్నిటిపై చైనా దురాక్రమణలు సాగిస్తుంది. ఒప్పందాలను ఉలంఘిస్తూ సరిహద్దులను ఆక్రమిస్తుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యమైన అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ కు మద్దతుగా అమెరికా దళాలను రంగంలోకి దించబోతుంది. అందుకోసం జర్మనీలో 52 వేల అమెరికా బలగాలను 25 వేలు తగ్గించింది. ఆ సైన్యాన్ని భారత్ కు పంపే విధంగా ట్రంప్ ఆదేశించారు. అవసరమైతే తమ వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగించి చైనాను అడ్డుకుంటామని అమెరికా వెల్లడించింది.

తాజాగా బ్రస్సెల్స్ ఫోరమ్ వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అమెరికా విదేశంగా మంత్రి మైక్ పంపియోను జర్మనీ నుంచి వేల సంఖ్యలో సైన్యాన్ని ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా పాంపియో ఈ విషయాన్ని వెల్లడించారు. చైనా నుంచి దక్షిణ ఆసియా దేశాలకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా భావిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ కు మద్దతుగా నిలిచి అగ్రరాజ్యం మరోసారి తన హుందాతనాన్ని చాటి చెప్పింది.

ఇటీవల భారత్ – చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఒకవైపు భారత్ తో చర్చల్లో శాంతి మంత్రం ఆలపిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించి చైనా కుట్ర పన్నుతోంది. చైనాను ఎదుర్కోవడానికి భారత్ ఇప్పటికే రహస్య వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా అమెరికా కూడా చైనాను టార్గెట్ చేస్తూ భారత్ కు మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కరోనాను ప్రపంచ దేశాలపైకి ఉసిగొల్పిందని చైనాపై అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Related News