logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

గ్రహాంతరవాసులతో అమెరికా – ఇజ్రాయెల్ రహస్య ఒప్పందం?

గ్రహాంతరవాసులు అనే వారు అసలు ఉన్నారా? ఇది ఎన్నో ఏళ్లుగా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. విశ్వంలో ఏదో గ్రహం పై వారు ఉన్నారని వారు మనకన్నా చాలా తెలివైన వారని అప్పుడప్పుడు ఎగిరే పల్లాల వంటి వాటిలో భూమి మీదకు వచ్చివెళతారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. వీరికి సంబందించిన ఏ చిన్న విషయమైనా ఆసక్తిగానే ఉంటుంది. అందుకే హాలీవుడ్ లో ఏలియన్స్ ఆధారంగా అనేక సినిమాలు రూపొందాయి. నిజ జీవితంలో ఏలియన్స్ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ఏరియా 51. అమెరికాలోని ఏరియా 51 అనే ప్రాంతంలో ఆ దేశ సైన్యం గ్రహాంతరవాసులను బంధించి పెట్టింది అని వాళ్ల నుంచే అధునాతన టెక్నాలజీని ఆ దేశం పొందుతోంది అని ఎన్నో ఏళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కూడా గ్రహాంతర వాసులు లేరని ఏనాడు పూర్తిగా కొట్టిపారేయలేదు. గ్రహాంతర వాసులకు అమెరికా అనేక కార్యక్రమాలు చేపడుతోందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదంతా నిజమా? అంటే అందుకు సంబందించిన కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవు.

ఇదిలా ఉండగా ఇటీవల ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ చీఫ్ గా పనిచేసిన హెయిమ్ షెడ్ గ్రహాంతరవాసుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గ్రహాంతర వాసులు నిజంగానే ఉన్నారని.. భూమ్మీద మనతో పాటు కలిసి తిరుగుతున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు గ్రహాంతరవాసులు మధ్య సంబంధాలు ఉన్నాయి. వీరంతా కలిసి పనిచేస్తున్నారని షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆ విషయం ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి కూడా తెలుసన్నారు. హెయిమ్ షెడ్ వ్యాఖ్యలను తేలికగా తీసుకోవడానికి లేదు. ఇజ్రాయెల్‌కి 30 ఏళ్ల పాటు అంతరిక్ష రక్షణ చీఫ్‌గా వ్యవహరించిన హెయిమ్ షెడ్ సాధారణ వ్యక్తి కాదు. మూడు సార్లు ఇజ్రాయెల్ సెక్యూరిటీ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. గ్రహాంతరవాసుల ఉనికిని తాను నిరూపించగలనని అయన అంటున్నారు.

ఎందుకంటే వారు చాలా కాలం పాటు మనతోనే.. మన మధ్యనే తిరుగుతున్నారని అన్నారు. వారు సొంతంగా ‘గెలాక్సీ ఫెడరేషన్’ అనే సంస్థను కలిగి ఉన్నారు. గ్రహాంతరవాసులు కూడా భూ గ్రహం మీద ఉన్న మనుషుల లాగానే విశ్వం మొత్తాన్ని పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం వారు మన సహాయం కోరుతున్నారని పేర్కొన్నారు. విశ్వం పై పరిశోధనల కోసం వారు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయాలను గ్రహాంతరవాసులు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా హైమ్ షెడ్ మాట్లాడుతూ.. మనుషులకు అంతరిక్షం, స్పెస్ షిప్స్, ఏలియన్స్ పట్ల ఒక అవగాహన వచ్చేవరకు వారు తమ గురించిన సమాచారాన్ని రహస్యంగానే ఉంచాలని భావిస్తున్నారు అని అన్నారు.

మార్స్ గ్రహంపై ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఉంది. అందులో ఏలియన్స్ కు సంబందించిన ప్రతినిధులు, అమెరికా వ్యోమగాములు కూడా ఉన్నారని అయన చెప్తున్నారు. అయితే ఈ ఏలియన్స్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని డోనాల్డ్ ట్రంప్ ఎంతగానో ఉబలాట పడేవారని అన్నారు. కానీ గెలాక్సీ ఫెడరేష లోని ఏలియన్స్ ఆయనను అపాయన్నారు. మనుషులకు తగినంత సమయం ఇచ్చి ఏలియన్స్ పట్ల ఒక అవగాహన ఏర్పడిన తర్వాత వారు తమ గురించి వెల్లడించాలని భావిస్తున్నారట. అమెరికా ఆర్మీల గతేడాది స్పేస్ ఫోర్స్ అనే ఒక కొత్త విభాగాన్ని ట్రంప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందుకు కారణం ఏలియన్స్ అని హైమ్ తెలిపారు. ఏలియన్స్ కు సంబందించిన ఈ విషయాలు తాను ఐదేళ్ల క్రితం చెప్పి ఉంటె తన మానసిక ఆరోగ్యం సరిగా లేదని ఈపాటికే ఆసుపత్రిలో ఉంచేవారని అన్నారు. ఈ ఇజ్రాయెల్ శాస్త్రవేత్త వ్యాఖ్యలపై అటు అమెరికా ప్రభుత్వం గాని డోనాల్డ్ ట్రంప్ గాని ఇప్పటివరకు స్పందించలేదు.

ప్రస్తుతం ఏలియన్స్ గురించి ఈయన చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొంత మంది ఈ వ్యాఖ్యలపై సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. అమెరికాను నియంత్రించగలిగే శక్తి ఏలియన్స్ కు ఉంటె వారు కచ్చితంగా టెక్నాలజి తెలిసిన వారే అయ్యుంటారు. మరి మార్స్ పై నిర్మాణాల కోసం వారు అమెరికా సాయం కోరాల్సిన అవసరం ఏముంది? వారే సొంతంగా నిర్మించుకోవచ్చు కదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హెయిమ్ వ్యాఖ్యలపై అటు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా స్పందించలేదు. దానికి తోడు హెయిమ్ తాను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. దీంతో ఏలియన్స్ ఉన్నారా? లేదా అనే విషయం మరోసారి ప్రశ్నార్థకంగానే మారింది.

Related News