logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

భారత్ కు అమెరికా క్షమాపణలు..

నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతంతో అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. పోలీసుల దురహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుసుపుతున్నారు. ఈ అల్లర్ల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం బయట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసారు. ఈ ఘటనపై భారత్ లోని అమెరికా రాయబారి కెన్నెత్ జాస్టర్ స్పందించారు.

గాంధీ మహాత్ముని విగ్రహాన్ని అపవిత్రం చేసినందుకు క్షమించండి.. దయచేసి మా హృదయ పూర్వక క్షమాపణలు అంగీకరించరుడి . డీసీ లోని నల్లజాతీయుల ఆందోళనల్లో విగ్రహం ధ్వంసం అయ్యిందన్నారు. అమెరికాలో మొత్తం 150 నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. 6 రాష్ట్రాలతో పాటుగా 13 నగరాల్లో ఎమర్జెనీ విధించారు.

కెన్నెత్ జస్టర్ మాట్లాడుతూ అమెరికా ఎటువంటి జాతి వివక్షను సహించదన్నారు. జార్జ్ ఫలాయిడ్ హత్య తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. త్వరలోనే తమ దేశం ఆందోళనల నుంచి కోలుకుని తిరిగి యథావిథిలంగా పాలన కొనసాగిస్తుందని తెలిపారు.

Related News