logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌

అంబాసిడ‌ర్ కార్ అంటే ఒక‌ప్పుడు హోదాకు చిహ్నం. పాత రోజుల్లో మ‌న దేశంలో అంబాసిడ‌ర్ కారు మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపించేది. అందుకే చాలామంది భార‌తీయుల‌కు అంబాసిడ‌ర్ అంటే ఒక ఎమోష‌న్‌. ఇంత‌లా ఇండియ‌న్స్‌కు క‌నెక్ట్ అయిన ఈ కారు ఇప్పుడు ఉత్ప‌త్తి కావ‌డం లేదు. ఐదేళ్ల క్రితం అంబాసిడ‌ర్ కారు ఉత్ప‌త్తిని ఆపేశారు. మారుతున్న ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లుగా మార‌క‌పోవ‌డం, కొత్త మోడ‌ళ్ల‌ను తీసుకురాక‌పోవ‌డం వ‌ల్ల అంబాసిడ‌ర్ ఆగిపోయింది.

అయితే, ఇప్పుడు ఈ కారును స‌రికొత్త లుక్‌, సూప‌ర్బ్ ఫీచ‌ర్స్‌తో మ‌ళ్లీ తీసుకువ‌స్తున్నారు. సీకే బిర్లా గ్రూప్‌కు చెందిన హిందుస్తాన్ మోటార్ ఫైనాన్షియ‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా కంపెనీ ఇప్పుడు మ‌ళ్లీ అంబాసిడ‌ర్‌ను ఉత్ప‌త్తి చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఈ కంపెనీ డైరెక్ట‌ర్ ఉత్త‌మ్ బోస్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అంబోయ్ కారు త‌ర‌హాలో అంబాసిడ‌ర్ కొత్త లుక్ ఉంటుంద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు.

చెన్నైలోని కంపెనీ స్వంత మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్‌లో ఈ కొత్త అంబాసిడ‌ర్ కారుకు రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంది. అధునాత‌న ఫీచ‌ర్లు, ప‌వ‌ర్‌ఫుల్ ఇంజ‌న్‌తో కొత్త అంబాసిడ‌ర్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇందుకోసం ఫ్రాన్స్‌కు చెందిన ప్ర‌ముఖ కార్ మేక‌ర్ ఫుచో కంపెనీతో హిందుస్తాన్ మోటార్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త అంబాసిడ‌ర్ కారు ఎల‌క్ట్రిక్ వ‌ర్ష‌న్‌లో రాబోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 2024లోనే ఈ కారు మార్కెట్‌లోకి విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

కాగా, ఒక‌ప్పుడు దేశంలో ఒక వెలుగు వెలిగిన హిందుస్తాన్ మోటార్స్ కంపెనీ ఆ త‌ర్వాత న‌ష్టాల్లో పూడుకుపోయి అంబాసిడ‌ర్ కార్ల ఉత్ప‌త్తిని 2017లో నిలిపివేసింది. మన దేశానికి స్వాతంత్య్రం రాక‌ముందు నుంచే గుజ‌రాత్‌లోని పోర్ట్ ఓఖాలో ఈ కంపెనీ అంబాసిడ‌ర్ కారు ఉత్ప‌త్తిని ప్రారంభించింది. మిత్సుబిషి కార్ల‌ను కూడా ఈ కంపెనీ త‌యారుచేసేది. కాల‌క్ర‌మంలో న‌ష్టాలు రావ‌డంతో రెండు కార్ల ఉత్ప‌త్తిని నిలిపేసింది. ఇప్పుడు ఫుజో కంపెనీతో క‌లిసి మ‌ళ్లీ అంబాసిడ‌ర్‌ను హిందుస్తాన్ మోటార్స్ కంపెనీ ఉత్ప‌త్తి చేయ‌నుంది.

Related News