చిరు వ్యాపారుల సాధికారత కోసం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ స్మాల్ బిజినెస్ డే 2020 ను నిర్వహిస్తుంది. ఇది ఈ సంస్థ నుంచి నాలుగవ ఎడిషన్ కానుంది. ఈ సేల్ లో భాగంగా అమెజాన్ తమ వినియోగదారుల కోసం అనేక డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తుంది. డిసెంబర్ 12 వ తేదీన అర్థరాత్రి 11:59 నిమిషాల నుంచి ఈ స్మాల్ బిజినెస్ డే సేల్ ను నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా గృహోపకరణాలు, భద్రత, పరిశుభ్రత, వాల్ డెకార్స్, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, వంట సామాగ్రి, క్రీడలు వంటి వాటిలో అవసరమైన ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నారు. అమెజాన్ వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసి కొనుగోలు చేసిన వాటిపై 10 శాతం ఒక రోజు క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ను ప్రకటించింది.
ఈ సేల్ లో ఉన్న ఆఫర్లు చూసుకుంటే.. గృహోపకారణాలపై 50 శాతం, ఫర్నిచర్ పై 50 శాతం, కిచెన్ పరికరాలపై 60 శాతం తగ్గింపు లభించనుంది. అలాగే డిన్నర్వేర్పై 60 శాతం, స్టోరేజ్ అండ్ ఆర్గనైజేషన్‌పై 50 శాతం, చీరలపై 70 శాతం, కుర్తీలపై 70 శాతం, మెన్స్‌వేర్‌పై 70 శాతం, కిడ్స్ వేర్‌పై 60 శాతం, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్‌పై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.