logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

నిరుద్యోగులకు అమెజాన్ శుభవార్త.. ఇంటర్ అర్హతతో రూ. 20,000 జీతం!

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆన్ లైన్ షాపింగ్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ కు భారీగా డిమాండ్ ఏర్పడింది. మరో ఆరు నెలల్లో ఆన్ లైన్ అమ్మకాలు మరింత జోరందుకుంటాయని సంస్థ భావిస్తుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది.

సీజనల్ ఎంప్లొయీమెంట్ కింద ఏకంగా 20 వేల కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. హైదరాబాద్ తో పాటుగా దేశవ్యాప్తంగా మరో 11 నగరాల్లో నియామకాలు చేపట్టనున్నామని అమెజాన్ ఇండియా కస్టమర్ సర్వీస్ విభాగం డైరెక్టర్ అక్షయ్ ప్రభు పేర్కొన్నారు. ఈమెయిల్స్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్లకు సేవలు అందించే విభాగాల్లో వీరికి ఉపాధి కల్పించనుంది.

అయితే ఇవి సంవత్సరం పాటు నడిచే తాత్కాలిక ఉద్యోగాలు కావడం వలన వేతనాలు కూడా భారీగానే చెల్లిస్తుంది. ఇంటర్ అర్హత ఉండి ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ బాషలలో మాట్లాడే నైపుణ్యం ఉన్నవారికి 15,000 వేల నుంచి 20,000 వేల వరకు వేతనాలు చెల్లిస్తారు. ఈ ఏడాది చివరికి డిమాండును బట్టి ఉద్యోగులను పెర్మినెంట్ చేసే విషయం పై నిర్ణయం తీసుకుంటామని అమెజాన్ తెలిపింది.

ఆసక్తిగల అభ్యర్థులు 18002089900 ఫోన్ చేయవచ్చని సంస్థ ప్రకటించింది. seasonalhiringindia@amazon.com కు మెయిల్ చేసి కూడా అభ్యర్థులు ఉద్యోగాలు పొందవచ్చని సంస్థ పేర్కొంది.

Related News