logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

మాజీ ప్రియుడిపై కోర్టుకెక్కిన అమలా పాల్..!

తమిళ దర్శకుడిని విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలా పాల్ కొద్ది రోజులకే భర్తతో విడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె నాకు నచ్చిన వ్యక్తి నా జీవితంలోకి వచ్చారంటూ ఓ పోస్టు చేసింది. కానీ అతనెవరో మాత్రం బయటకు వెల్లడించలేదు. ఆ మధ్య అమల పాల్ పెళ్లి దుస్తులతో ఓ వ్యక్తితో కలిసున్న ఫోటోలు సోహాల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ తర్వాత కొంత సమయానికే అమలా వాటిని తొలగించింది. అవి నా పెళ్లి ఫోటోలు కాదని ప్రొఫెషనల్ షూట్ కోసం నా స్నేహితుడితో తీసుకున్న ఫోటోలని చెప్పి క్లారిటీ ఇచ్చింది. అతని పేరు భువినిందర్ సింగ్. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుని విడిపోయారంటూ బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిపైనే అమలా పాల్ చెన్నై హై కోర్టును ఆశ్రయించింది.

తాను భాగస్వామిగా ఉన్న సంస్థ లో ప్రొఫెషనల్ షూట్ కోసం తీసుకున్న ఫోటోలను తన అనుమతి లేకుండా వేరే అర్థం వచ్చేలా భువినిందర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడంటూ అమల పాల్ ఆరోపిస్తుంది. అతనిపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమైంది. వీరి వాదనలు విన్న న్యాయమూర్తి భువినిందర్ సింగ్ పై కేసు నమోదు చేసేందుకు అనుమతినిస్తూ తీర్పునిచ్చారు. ‘ఆడై’ సినిమాతో సంచలనం రేపిన అమలా కోలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది.

Related News