టాలీవుడ్ లో క్రేజీ కపుల్ లిస్టులో అల్లు అర్జున్- స్నేహరెడ్డిల పేర్లు ముందు వరసలో ఉంటాయి. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లుగా అన్యోన్యంగా ఉంటున్న ఈ జంట గురించి ఏ చిన్న విషయమైనా నెటిజన్లు ఆసక్తి చూపుతుంటారు. ఇక బన్నీ స్నేహ అంటే తనకెంత ప్రేమో చాలా సార్లు వ్యక్తపరిచాడు.
తాజాగా సమంత నిర్వహిస్తున్న ‘సామ్ జామ్’ షోలో బన్నీ తన ప్రేమ పెళ్లిపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. స్నేహరెడ్డితో అల్లు అర్జున్ వివాహం 2011 లో జరిగింది. పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అయితే అప్పట్లో సోషల్ మీడియా అంతగా యాక్టీవ్ గా లేకపోవడం వల్ల వీరి ప్రేమ గురించి అంతగా బయటకు తెలియలేదు.
అయితే స్నేహ రెడ్డిని అల్లు అర్జున్ మొదటిసారి ఓ పబ్ లో చూశాడట. అప్పుడు సమయం అర్థరాత్రి 2 గంటలవుతుంది. అర్థరాత్రి అంతమందిలో కూడా ఆమె డిగ్నిటీగా ఉండటం చూసి ఇష్టపడ్డాను. తనలో నాకు నచ్చేది అదే. ఆమె డిగ్నిటీ అంటే నాకు చాలా ఇష్టం అంటూ బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.