logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఇకపై నేనేంటో చూపిస్తా.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్!

త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా మారిందో తెలిసిన విషయమే. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా సినిమాలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా విడుదలై సంవత్సరం పూర్తైన సందర్భంగా సినిమా యూనిట్ అంతా రీ యూనియన్ మీట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ ఆసక్తికరంగా మారింది. 2020 అందరికీ బ్యాడ్ ఇయర్ గా అంటున్నారు. కానీ నాకు మాత్రం గడిచిన ఏడాది మరిచిపోలేని విజయాన్ని ఇచ్చింది. అంత పెద్ద విజయాన్ని నా కెరీర్ లో చూడలేదు. సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

అలవైకుంఠపురములో సినిమాకు ముందు సంవత్సరం పాటు ఇంట్లో ఖాళీగా ఉన్నా.. సినిమా విడుదలయ్యాక కూడా సంవత్సరం కాలీగా ఉన్నా కానీ ఈ గ్యాప్ లో ఈ సినిమా నాకు ఇచ్చిన ఎనర్జీ మర్చిపోలేనిది. ప్రతి స్టార్ కి లైఫ్ లో ఏదో ఒక రోజు ఇండస్ట్రీ హిట్ దక్కుతుంది అది నా విషయంలో చాలా ఆలస్యంగా జరిగింది.

కళ్యాణ్ గారికి అది ‘ఖుషి’ సినిమాతో దక్కింది. అది ఆయనకు ఎడో సినిమా అనుకుంట. జూనియర్ ఎన్టీఆర్ కి ‘సింహాద్రి’తో వచ్చింది. రామ్ చరణ్ కు రెండో సినిమానే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్. వాళ్ళలా నాకెప్పుడో వస్తుందో అని చాలా సార్లు అనుకునే వాడిని 20 సినిమాల తర్వాత నాకు కూడా అలాంటి హిట్టు దక్కింది.

ఇదే నా మొదటి అడుగు ఇకపై నేనేమిటో చూపిస్తా అంటూ అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. సినిమా సక్సెస్ కు కారణమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ. అలాగే తనకు బ్లాక్ బస్టర్ ఆల్బమిచ్చిన ఎస్ ఎస్ థమన్ ను అభినందనల్లో ముంచెత్తాడు.

 

Related News