logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

అల్లు అర్జున్ సినిమా షూటింగ్ లో మరో అపశ్రుతి.. ఆందోళనలో ఫాన్స్!

అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జి శ్రీనివాస్ గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ కారవాన్ ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం రంపచోడవరంలో పుష్ప సినిమా షూటింగ్ తిరుగుతుండగా… సత్యనారాయణపురం దగ్గర ఈ ఘటన జరిగింది.

వేగంగా వెళ్ళుతున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వచ్చిన మరో భారీ వాహనం వాహనం అల్లు అర్జున్ కారవాన్ ను ఢీ కొట్టింది. దీంతో వాహన వెనుక భాగం ధ్వంసమైంది. కాగా ఈ ఘటనపై సినిమా టీమ్ స్పందించింది. ప్రమాదం జరిగిన సమయంలో అల్లు అర్జున్ వాహనంలో లేరని క్లారిటీ ఇచ్చింది.

అయితే అల్లు అర్జున్ కారవాన్ ను గుర్తించిన స్థానికులు అందులో ఆయన ఉన్నారని భావించి పరుగులు తీస్తూ వెళ్లారు. చివరకు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా తమ హీరో సినిమాలో ఇలా వరుస ఘటనలు చోటుచేసుకోవడం బన్నీ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ కు సంబందించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 

Related News