logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బాలీవుడ్ హీరోతో ‘ఆర్ఆర్ఆర్’ సీత నిశ్చితార్థం?

రణబీర్ కపూర్ – అలియా భట్ జంట ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ హప్పెనింగ్ కపుల్ గా ఉన్నారు. ఈ స్టార్ కిడ్స్ ప్రేమ వ్యవహారం కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం వార్తలు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. ఇటీవల హీరో రణ బీర్ కపూర్ మాట్లాడుతూ తామిద్దరం 2020 సంవత్సరంలోనే పెళ్లి చేసుకోవాలని భావించామని కరోనా లాక్ డౌన్ వల్ల అది సాధ్యపడలేదని చెప్పి షాకిచ్చాడు.

ఈ నేపథ్యంలో ఈ జంట రెండు కుటుంబాలతో కలిసి గుజరాత్ లోని రణతంబోర్ పార్కుకు సమీపంలో ఉన్న సవాయి మథోపూర్ కు వెళ్లారు. అదే సమయంలో వీరిద్దరికి మంచి స్నేహితులైన రణధీర్ సింగ్, దీపికా పడుకునే జంట కూడా అక్కడ వాలిపోయారు. ఇదంతా చోసిన అభిమానులు అలియా- రణబీర్ లు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంటున్నారని భావించారు.

దీంతో వీరిద్దరికి సంభదించినఈ వార్త ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఈ వార్తలపై రణబీర్ కపూర్ అంకుల్ రణధీర్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. మేమంతా కొత్త సంవత్సరం వేడుకల కోసం కుటుంబంతో సహా వచ్చాము. వారిద్దరికీ నిశ్చితార్థం జరిపించడానికి కాదని చెప్పుకొచ్చారు. దీంతో ఈ రూమర్లకు చెక్ పడింది. కాగా ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే

Related News