logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

అఖిలప్రియ కేసులో కొత్త ట్విస్ట్.. ఆ సినిమా చూసి కిడ్నాప్ చేసారు!

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. కాగా ఈ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అఖిల ప్రియను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరో వైపు ఆమె భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరితో పాటుగా అఖిల ప్రియ కుటుంబ సభ్యుల పాత్రపై కూడా విచారణ చేపట్టారు పోలీసులు.

అయితే ఈ కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులను కిడ్నాప్ చేసేందుకు ఐటీ అధికారుల వేషంలో వెళ్లిన నిందితులు అందుకోసం ముందుగా శిక్షణ తీసుకున్నారు. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్‌లో భార్గవ్ రామ్ సోదరుడు చంద్రహాస్ అఖిల ప్రియ అండ్ గ్యాంగ్ కు వారం రోజులపాటు శిక్షణ ఇచ్చాడు. అందుకోసం కిడ్నాపర్ల కు చంద్రహాస్ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ చబ్బీస్’ సినిమాను చూపించాడు.

అచ్చం అలాగే కిడ్నాప్ కు పథకం వేసాడు. ఐటీ ధికారులుగా ఎలా నటించాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలను ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీ నగర్ కాలనీకి సమీపంలో ఐటీ అధికారులకు సంబందించిన బట్టలను అద్దెకు తీసుకున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

Related News