బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో అఖిల ప్రియను ఏ1నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త భార్గవ్ రామ్ పాత్రపై కూడా పోలీసులు వివరాలను సేకరించారు. కాగా ఈ కేసులో అఖిల ప్రియ, కిడ్నాపర్లతో పాటుగా తాజాగా మరో ముగ్గురు అఖిలప్రియ అనుచరులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసారు.
వారిలో మల్లికార్జున్ రెడ్డి, సంపత్‌కుమార్, అఖిలప్రియ పీఏ బాలచెన్నయ్యలు ఉన్నారు. కిడ్నప్ కోసం అఖిల ప్రియా, కిడ్నపర్లు కలిసి కూకట్పల్లి లోని ఎస్ కె మొబైల్స్ లో రెండు కొత్త సిమ్ కార్డులను తీసుకున్నారు. నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్లు, కార్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో అఖిలప్రియ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. కిడ్నాప్ జరిగిన రోజు ఏం జరిగిందనే విషయాన్ని సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు సెల్ టవర్లను ట్రేస్ చేసాము. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుంటూరు శీను కు నిందితులంతా టచ్ లోనే ఉన్నారు. యూసుఫ్ గుడాలో భార్గవ్ రామ్ కుచెందిన ఎంజిఎం స్కూల్ కు భార్గవ్ రామ్ వచ్చాడు. అఖిల ప్రియా పర్సనల్ నంబరుకు గుంటూరు శ్రీను 49 సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు. శీను నుంచి మరో నిందితుడికి 29 సార్లు ఫోన్లు వెళ్లాయి. కిడ్నాప్ లో భార్గవ్ రామ్ పాత్ర కీలకంగా ఉంది.
సాక్ష్యాల ఆధారంగా అఖిల ప్రియను ఏ-1 గా తేల్చాము. గుంటూరు శ్రీను, మల్లికార్జున రెడ్డి పేర్లతో ఉన్న ఫోన్ నంబర్లను అఖిలప్రియ వాడారు. కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్ రికార్డింగులు తమ వద్ద ఉన్నాయంటూ అంజనీ కుమార్ స్పష్టం చేసారు. ఈ కేసులో మొత్తం 9 మంది (భార్గవ్ రామ్(నంద్యాల), సంపత్ కుమార్(ఆళ్లగడ్డ), మాదాల శ్రీను(గుంటూరు), మల్లిఖార్జున రెడ్డి(అనంతపూర్), బాలు(కడప), కృష్ణ(గుంటూరు), దేవ ప్రసాద్(గుంటూరు), వంశీ(గుంటూరు), సిద్ధార్థ(గుంటూరు) ) ని పోలీసులు నిందితులుగా తేల్చారు.