logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

మూవీ రివ్యూ: ‘ఆకాశమే నీ హద్దురా!’

నటీనటులు: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రావల్, ఊర్వశి, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు
దర్శకత్వం: సుధా కొంగర
సంగీతం: జివి ప్రకాష్
నిర్మాత: సూర్య

పేదవారికి అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం అందించాలని కళలు కన్న వ్వ్యాపారవేత్త జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమా ‘ఆకాశమే నీ హద్దురా!’. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జి ఆర్ గోపినాథ్ పాత్రలో విలక్షణ నటుడు సూర్య కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకురాలు సుధా కొంగర కథను నమ్మి ఈ సినిమాతో సూర్య నిర్మాతగా కూడా మారాడు. కానీ కరోనా కారణంగా థియేటర్లలో విడుదల కావలసిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 11వ తేదీ విడుదల చేసారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
గుంటూరు జిల్లాలోని చుండూరు లాంటి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగాడు అనేదే సినిమా కథ. కెప్టెన్ జీఆర్ గోపినాథ్ జీవిత కథకు కమర్షియల్ అంశాలను జోడించమంటూ సినిమా టీమ్ ముందుగానే ప్రకటించింది. చంద్ర మహేష్ అలియాస్ మహా(సూర్య) ఓ సాధారణ స్కూలు మాస్టారు కొడుకు. తండ్రిలాగానే సమాజం గురించి ఆలోచించే వ్యక్తి. తాను అనుకున్నట్టుగానే ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగంలో చేరతాడు.

అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా పేద, మధ్యతరగతి వారికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంటాడు. తన లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో పారిశ్రామిక, రాజకీయవేత్తల నుంచి ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది. చివరకు మహా తాను అనుకున్నది సాధిస్తాడా? పరేష్ గోస్వామి నుంచి అతనికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? ఈ కథలో భక్తవత్సలం నాయుడు (మోహన్ బాబు) పాత్ర ఏమిటి? తన జీవిత భాగస్వామి (అపర్ణ బాలమురళి) ఎలాంటి పాత్రను పోషించింది అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: 

బయోపిక్ ను తెరకెక్కించడం అంటే దర్శకులకు అంత తేలికైన పని కాదు. ఒకవైపు నిజ జీవితాన్ని ఆవిష్కరిస్తూనే అందులో సినిమాకు అవసరమైన హంగులను జోడించాల్సి ఉంటుంది. ఈ రెండిటిలో ఏది తక్కువనా, ఎక్కువైనా అది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతుందనే చెప్పలి. కానీ కొన్ని సినిమాల అనుభవంతోనే మన తెలుగు దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను మలిచిన తీరు అభినందించాల్సిందే. గతంలో వెంకటేష్ తో తీసిన ‘గురు’ సినిమా తరువాత ఈ సారి ఆమె బయోపిక్ ను ఎంచుకున్నారు. ఈ సినిమాతో మరోసారి సుధా కొంగర మార్కు సినిమాను చూస్తారు.

కెప్టెన్ జీఆర్ గోపినాథ్ జీవితంలో జరిగిన ప్రతి సన్నివేశాన్ని చూపించగలిగారు. గాంధేయ మార్గాన్ని అనుసరించే తండ్రికి, తండ్రి పద్దతులను, విధానాలను ఎదురించి ఏది ఏమైనా అనుకున్నది సాధించాలనే కొడుకుకి మధ్య సంఘర్షణను మనసుకు హత్తుకునే విధంగా చూపించలిగలిగారు. తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిసి హీరో విమానం ఎక్కడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాయి. ఈ సినిమాతో మరోసారి సూర్యలోని అద్భుతమైన నటుడిని చూస్తారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలానే ఉంటాయి. సెకండ్ హాఫ్ లో తన జీవిత భాగస్వామితో ప్రయాణం. వారిద్దరి మధ్యన వచ్చే సహజమైన సన్నివేశాలు ప్రేక్షకులను కథలో మరింత లీనం చేస్తాయి.

సుందరి అలియాస్ బేబీ పాత్రలో నటించిన అపర్ణ బాలమురళి సూర్యతో పోటీపడి మరీ నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకున్న బలాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. షాలిని ఉషాదేవి, సుధా కొంగర కలిసి రాసుకున్న కథ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఏవియేషన్ బిజినెస్ కు సంబందించిన విషయాలను సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చెప్పిన తీరు దర్శకురాలి క్రియేటివిటీకి అద్దం పడుతుంది. భక్తవత్సలం నాయుడుగా నటించిన మోహన్ బాబు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించి అలరిస్తారు.

సినిమా మొదటి నుంచి క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగానే సాగుతుంది. సినిమాటోగ్రఫీ, జివి ప్రకాష్ అందించిన పాటలు బాగున్నాయి. హీరో సత్యదేవ్ తో సూర్యకు డబ్బింగ్ చెప్పించి కొత్తదనం ప్రయత్నించారు. కెప్టెన్ గోపినాథ్ రాసిన ‘సింప్లి ఫై’ అనే పుస్తకాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. మొత్తానికి ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగారు సినిమా టీమ్.

సూర్య నటన, కథ, ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. సినిమాలో తెలిసిన నటీనటులు తక్కువగా ఉండటం తెలుగుదనం లోపించడం, సినిమా నిడివి మైనస్ గా నిలిచాయి. ఓవర్ ఆల్ గా ఆకాశమే నీ హద్దురా! సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News