logo

  BREAKING NEWS

అవును అప్పులు చేసాం.. ఆ విషయం గర్వంగా చెప్తాం : మంత్రి బుగ్గన  |   షాకింగ్ సర్వే.. హైదరాబాద్ లో ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా!  |   అసెంబ్లీ ఎన్నికల ముందు కేరళ సీఎంకు షాక్.. విజయన్ మెడకు మళ్ళీ అదే కేసు!  |   హై కోర్టుకు ఎన్నికల సంఘం క్షమాపణలు.. ఎందుకంటే?  |   ఇదేనా దోస్తానా..? ఏపీలో అడుగుపెడుతున్న ఎంఐఎం  |   మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |  

రూపాయి ఖర్చు లేకుండా కిడ్నీల్లో రాళ్లు, జీర్ణ సమస్యలు, అధిక బరువును ఇలా తగ్గించుకోండి!

ప్రతి ఇంట్లోని పోపుల పెట్టెలో లభించే వాము ఒక సుగంధ ద్రవ్యమే కాదు దీని వల్లనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రుచికి శుచికి ఆరోగ్యానికి వాము పెట్టింది పేరు. దీనికి భారత దేశం పుట్టినిల్లు. వాములో పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారికి వాము అద్భుతమైన పరిష్కారం. రెండు టీస్పూన్ల వాముని దోరగా వేయించి, దాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టండి. దాన్ని ఉడికించి, వడగట్టి, చల్లబడే వరకు ఆగి తీసుకోవాలి. వాము నీటిని తాగితే జీర్ణసంబంధ సమస్యలు చిటికెలో దూరమవుతాయి. పొట్ట సమస్యలను తగ్గించి ఆకలిని పెంచుతుంది. ఇందులో ఉండే థైమాల్ అనే రసాయనం శీలింద్రాలు, సూక్ష్మ జీవులపై పని చేస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారు వాము నీటిని క్రమ పద్దతిలో తీసుకోవడం ద్వారా కొవ్వును కరిగించి బరువు తగ్గడంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

వెంట్రుకలను తెల్లబడకుండా మార్చే శక్తి వాముకు ఉంది. గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసెరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును అదుపు చేసి ఒత్తిడి సమస్యలను దూరం చేస్తుంది. వాములో కాస్తంత ఆవనూనె వేసి ఇంట్లో ఒక మూలన పెడితే దోమల బెడద తగ్గుతుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవారికి వాము చాలా మంచి ఔషధం. వామునూనెను కీళ్ల నొప్పులు ఉన్న చోట మర్దన చేసినా ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఆంటిబయోటిక్, అనస్తీటిక్ విలువల కారణంగా కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. పొట్టలో ఆసిడ్లను తగ్గించే గుణం వాములో ఉంది. చిన్న పిల్లలు పొట్ట సమస్యలతో తరచుగా ఏడుస్తుంటే వారికి వాము నీటిని తాగిన మోతాదులో తాగించండి. పిల్లల్లో అజీర్తి, గ్యాస్ సమస్యలను ఇది పూర్తిగా దూరం చేస్తుంది.

వాములోనే కాకుండా వాము ఆకుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీలైతే వాము చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ ఆకులతో చేసిన పకోడీలు అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. వామాకును పచ్చళ్ళు, చట్నీలు, కూరలలో వాడుకోవచ్చు. వామును వెనిగర్ లేదా తేనెతో కలిసి వారం రోజుల పాటు తీసుకుంటే మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. విపరీతమైన దగ్గు వేధిస్తుంటే అర టీస్పూను వాములో రెండు లవంగాలు చిటికెడు ఉప్పు కలిపి చూర్ణం చేయండి. అరకప్పు వేడి నీటిలో దీనిని కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తాగుతుంటే దగ్గు మాయమైపోతుంది.

వామును మజ్జిగతో కలిపి తీసుకుంటే కఫము కారణంగా ఏర్పడే ఇబ్బందులు తోలగిపోతాయి. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే మార్గాలు శుభ్రపడతాయి. గర్భిణీ స్త్రీలలో మలబద్దకం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలకు వాము నీటిని తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ప్రసవం తర్వాత జీర్ణ సమస్యలు తలెత్తకుండా, పాలు పట్టేందుకు, గర్భాశయం శుబ్రపడేందుకు వామును తీసుకోవాలని చెప్తారు.

Related News