logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

అగ్రి గోల్డ్ కేసు: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి!

అగ్రి గోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తరఫున నగదును తిరిగి చెల్లించే విధంగా అనుమతులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హై కోర్టులో విచారణ జరిగింది. రూ. 20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బును తిరిగి చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హై కోర్టు అనుమతులు ఇచ్చింది.

వార్డు సచివాలయం ద్వారా సీఐడీ, సీఐ డిపాజిటర్ల వివరాలను సేకరిస్తారని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సేకరించిన వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో సమక్షంలో పరిశీలిస్తామని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, సిఐడి ఎస్పీ దరఖాస్తులను ధృవీకరిస్తారు. కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్లకు డబ్బును వారి వారి ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

ఈ ప్రక్రియ మొత్తాన్ని మార్చి 31 నాటికి పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసును ఏపీ హై కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రభుత్వం తరపున దాఖలైన పిటిషన్ పై కోర్టు స్పందిస్తూ .. కేసును బదిలీ చేసే అధికారాలు తెలంగాణ హైకోర్టు సీజేకు ఉంటాయని వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియకు మరో 2 వారాల గడువును ఏపీ ప్రభుత్వం కోరగా అందుకు ధర్మాసనం అనుమతిచ్చింది.

Related News