logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

దేశంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తారా… నిజమెంత?

దేశంలో కరోనా వైరస్ ను నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ ను కేంద్రం సడలిస్తుండటంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరిపీల్చుకుంటున్నారు. అదే సమయంలో కరోనా కేసుల తీవ్రత ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నట్టుగా ప్రకటించిన రోజు నుండి ఇప్పటివరకు దేశంలో కరోనా విజృంభిస్తుంది. నేడు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 24 గంటల్లో దేశంలో 9,996 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 357 మంది కరోనాతో మరణించారు.

అయినా కూడా దేశ ఆర్థిక వ్వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని కేంద్రం అన్ లాక్ డౌన్ 1 పేరుతో జూన్ 8వ తేదీ నుండి హోటల్స్, షాపింగ్ మాల్స్, దేవాలయాలు ఇలా అన్నిటికి అనుమతులు ఇచ్చింది. త్వరలోనే అన్ లాక్ డౌన్ 2ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే గత కొన్ని రోజులుగా రోజులు పది వేల కేసులు నమోదవ్వడం, వందల సంఖ్యలో మరణాలు, కమ్యూనిటీ స్ప్రెడ్ కేసులు పెరుగుతుండటం కలవర పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య మరిన్ని సడలింపులు ఇవ్వడం వల్ల పరిస్థితి మరింత చేజారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మరోవైపు ఇండియా వంటి దేశాల్లో కరోనా వైరస్ ను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. కానీ లాక్ డౌన్ వల్ల రాష్ట్రాలు, కేంద్రానికి ఆదాయం లేకపోవడం వల్ల సడలింపులు ఇవ్వడమే ఉత్తమమని భావించినట్టు నిపుణుల అభిప్రాయం. ఎలాంటి ముందు జాగ్రత చర్యలు పాటించకపోవడం, లాక్ డౌన్ విధించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా అమెరికాలో లక్షల మారణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ కరోనా బాధితుల దేశాల సంఖ్యలో భారత్ 6 వ స్థానంలో నిలిచింది.

అసలే వైద్య సదుపాయాలు, ఆసుపత్రులు లేని దేశం మనది. గాంధీ ఆసుపత్రి వైద్యులపై కరోనా కేసుల భారం అధికమవుతుంది అని జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కరోనా ఉదృతి పెరిగితే ఆ ధాటికి దేశంలోని వైద్య వ్యవస్థ మరింత కుంగిపోతుంది. అప్పుడు ఇండియా మరో అమెరికా అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేసథ్యంలో దేశంలో జూన్ 25 నుండి మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు పుట్టుకొస్తున్నాయి. కరోనా కేసుల ధాటికి చాలా దేశాల తిరిగి లాక్ డౌన్ విధించాయి కూడా. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో ఇప్పుడు భారత్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ అంశంపై నేడో రేపో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News